Gold mine fire in Peru: దక్షిణ పెరూలోని బంగారు గనిలో మంటలు చెలరేగి 27 మంది కార్మికులు మరణించారు. వర్కర్స్ నైట్ షిప్ట్ సమయంలో పనిచేస్తుండగా ఈ అగ్నిప్రమాదం సంభవించింది. యానాక్విహువా మైనింగ్ కంపెనీ చెందిన గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 175 మంది కార్మికులను సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. తమ వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు అరేక్విపా ప్రాంతానికి చేరుకున్నారు.
గత 20 సంవత్సరాల్లో జరిగన ఘోరమైన మైనింగ్ ప్రమాదాల్లో ఇది ఒకటి. గోల్డ్ ఉత్పత్తి చేసే దేశాల్లో పెరూ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు శాతం బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా రెండవ అతిపెద్ద రాగి ఉత్పత్తిదారు. పెరూలో మైనింగ్ ప్రమాదాలు సర్వసాధారణంగా. ప్రతి ఏటా పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందుతారు. దేశంలో 2002లో జరిగిన మైనింగ్ ప్రమాదాల్లో 73 మంది చనిపోయారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల లాటిన్ అమెరికన్ దేశాల్లో తరుచూ మైనింగ్ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.
Also Read; Congo Floods: కాంగోలో వరద బీభత్సం.. 200 మందికిపైగా మృతి.. వందలాది మంది గల్లంతు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook