Chinese apps banned: చైనా యాప్స్‌ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్

59 apps banned India: న్యూ ఢిల్లీ: చైనా యాప్స్‌పై నిషేధం విధిస్తూ భారత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పెను సంచలనం సృష్టించింది. లఢఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో ఉన్న భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణ ( India-China face off ) అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

Last Updated : Jun 30, 2020, 04:15 PM IST
Chinese apps banned: చైనా యాప్స్‌ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్

59 apps banned India: న్యూ ఢిల్లీ: చైనా యాప్స్‌పై నిషేధం విధిస్తూ భారత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పెను సంచలనం సృష్టించింది. లఢఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో ఉన్న భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణ ( India-China face off ) అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనేక వివాదాలు నడుస్తుండగా.. తాజాగా చోటుచేసుకున్న ఘర్షణ రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. సరిహద్దుల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. జూన్ 30న సైతం భారత్, చైనా మధ్య చర్చలు జరగాల్సి ఉందనగా... అంతకంటే ఒక్క రోజు ముందే భారత్‌లో 59 యాప్స్‌పై నిషేధం విధిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. భారత్ నిషేధించిన యాప్స్ లో చైనాకు చెందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, హెలో, షేర్ ఇట్, క్యామ్ స్కానర్, న్యూస్ డాగ్ వంటి యాప్స్ ఉన్నాయి. దీంతో భారత్ తీసుకున్న నిర్ణయం చైనా యాప్స్ పైనే అధిక ప్రభావం చూపించనుంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. Tik Tok, UC Browser: టిక్‌ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం )

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఈ విషయంపై స్పందిస్తూ.. చైనా యాప్స్‌ని భారత్ నిషేధించడం ఆందోళనకు గురిచేసే అంశమని.. ప్రస్తుత పరిణామాలను తాము పరిశీలిస్తున్నామని అన్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News