Donald Trump Oath Ceremony: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికార పీఠం ఎక్కుతున్నాడు. దీనికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లకు గాను 312 ఎలక్ట్రోరల్ ఓట్లను సాధించాడు. మొత్తంగా 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు గాను మ్యాజిక్ మార్క్ 270 ను దాటి అద్భుత రికార్డును క్రియేట్ చేసారు 78 ఏళ్ల ట్రంప్. పాపులర్ ఓట్లలో హారిస్‌పై… ట్రంప్ దాదాపు 50లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. సంప్రదాయ రిపబ్లికన్ రాష్ట్రాలను నిలబెట్టుకోవడంతోపాటు స్వింగ్ రాష్ట్రాలు అన్నంట ట్రంప్ హవా సాగింది. ద్రవ్యోల్బణం,అక్రమ చొరబాట్లు, ఉద్యోగాలు, జీతాలు వంటి అంశాలు ఈ ఎలక్షన్స్ లో ట్రంప్ విజయానికి దోహదం చేశాయి.
ఈ ఎన్నికల్లో భారత మూలాలకు చెందిన కమలా హారిస్ లో ట్రంప్‌తో హోరాహోరీగా తలపడ్డారు. అభ్యర్థిగా చివరి నిమిషంలో ఖరారు కావడం, ప్రచారంలో వెనుకబడిపోవడం, ఉపాధ్యక్ష అభ్యర్థి విషయంలో పార్టీలో కుమ్ములాటలు, ఇతర దేశాల్లో యుద్దాల్లో ప్రేరేపించడం ఇలా చాలా కారణాలు కమలా ఓటమికి కారణమయ్యాయని పొలిటికల్ అనలిస్టులు చెప్పిన మాట.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఎలక్షన్స్ ముందు, ఎగ్జిట్ పోల్స్‌లో ప్రజాస్వామ్యం, అబార్షన్ హక్కు,ఆర్థిక వ్యవస్థ ప్రధానాంశాలని అమెరికన్లు పేర్కొన్నారు. అయితే దానికి భిన్నంగా అధిక ధరలు, వలసలు ఎన్నికల్లో ప్రభావం చూపాయి. 20 ఏళ్ల తర్వాత ఎలక్టోరల్ ఓట్లతో పాటు పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్ అధ్యక్షుడిగా ట్రంప్ మరో రికార్డు క్రియేట్ చేశారు. 2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ రెండింటిలోనూ ఆధిక్యం సాధించారు. 20 యేళ్ల తర్వాత ఆ రికార్డును తిరగరాసారు ట్రంప్. ట్రంప్ మొత్తంగా 50 రాష్ట్రాలలకు గాను 31 రాష్ట్రాల్లో ఆధిక్యం సాధిస్తే..డెమెక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్ 19 రాష్ట్రాల్లో విజయం సాధించారు. రెండు సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. రెండు సార్లు మహిళలపై గెలుపొందటం విశేషం.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.