Man slips into coma after Asian Tiger Mosquito Bite: జర్మనీకి చెందిన 27 ఏళ్ల వ్యక్తి సెబాస్టియన్ రోట్ష్కే దోమకాటుతో బతికుండగానే నరకం చూశాడు. టైగర్ దోమ కాటుకు అతడు జీవితంలో అత్యంత దారుణమైన అనుభవాన్ని చవిచూశాడు. కొన్నివారాల పాటు సెబాస్టియన్ కోమాలోనే ఉన్నాడు. శరీరంలో వివిధ అవయవాలకు ఇన్‌ఫెక్షన్ సోకగా.. వైద్యులు 30 శస్త్రచికిత్సలు చేశారు. అంతేకాదు సెబాస్టియన్ రెండు కాలివేళ్లను వైద్యులు తొలిగించారు. ఓ చిన్న దోమ సెబాస్టియన్ జీవితాన్నే పూర్తిగా నాశనం చేసింది.
డైలీ స్టార్ నివేదిక ప్రకారం... జర్మనీలోని రోడర్‌మార్క్‌లో సెబాస్టియన్ రోట్ష్కే నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం టైగర్ దోమ అతడిని కుట్టింది. టైగర్ దోమ కాటు కారణంగా ప్రాణాంతక బాక్టీరియా సెబాస్టియన్ శరీరం అంతటా వ్యాపించింది. దాంతో అతడు బ్లడ్ పాయిజనింగ్‌తో బాధపడ్డాడు. క్రమక్రమంగా కాలేయం, మూత్రపిండాలు, గుండె మరియు ఊపిరితిత్తులు పాడయ్యాయి. ఆపై కోమాలోకి వెళ్లిపోయాడు. బాక్టీరియా కాయానంగా అతని ఎడమ కాలి తొడ పూర్తిగా పాడైంది. ఆ ప్రాంతంలో ఏర్పడిన చీము తొలగించడానికి చర్మ మార్పిడి చేశారు వైద్యులు.
టైగర్ దోమ కాటు కారణంగా సెబాస్టియన్ రోట్ష్కే ఏకంగా 30 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. దాంతో సెబాస్టియన్ బతికుండగానే నరకం చూశాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. 'టైగర్ దోమ ఎక్కడ కుట్టిందో నాకు తెలియదు. దాని కాణంగా నేను మంచానపడ్డా. జ్వరం వచ్చింది. ఏదీ తినలేకపోయా. మొత్తం చెమటలు పట్టేవి. నా ఎడమ తొడ మీద చీము ఏర్పడింది. ఇక నా పని అయిపొయింది అనుకున్నా. ఆసియా టైగర్ దోమ కాటేసింది డాక్టర్లు చాలా త్వరగా గుర్తించారు. స్పెషలిస్ట్ వైద్యుడి సాయంతో కోలుకుంటున్నా' అని సెబాస్టియన్ డైలీ స్టార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
టైగర్ దోమ కాటు సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
# జ్వరం
# కడుపు నొప్పి
# వాంతులు
# ఊపిరి ఆడకపోవడం
# ముక్కు ద్వారా రక్తస్రావం
# అలసట
# కళ్లలో నొప్పి
# దీర్ఘకాలిక తలనొప్పి
# దద్దుర్లు మరియు వాపు
Also Read: Minister Roja: కబడ్డీ ఆడిన మంత్రి రోజా.. ఒక్కసారిగా మీదపడ్డ విద్యార్థులు! వైరల్ వీడియో
Also Read: Gold Price Hike: పెళ్లిళ్ల సీజన్ మొదలు.. ఏకంగా రూ. 1,760 పెరిగిన బంగారం ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.