Mysterious Liver Illness: పరిస్థితి చూస్తుంటే వైరస్‌లన్నీ కట్టగట్టుకుని ప్రపంచంపై దండయాత్ర మొదలుపెట్టినట్లే ఉంది. కరోనా వైరస్ దెబ్బతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలను మరో కొత్త వ్యాధి కలవరపెడుతోంది. అమెరికా, యూకె సహా పలు దేశాల్లో అంతుచిక్కని కాలేయ సంబంధిత వ్యాధి బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా చిన్నారుల్లోనే ఈ కేసులు ఎక్కువగా బయటపడినట్లు తెలిపింది. జలుబు సంబంధిత వైరస్ కారణంగానే ఈ వ్యాధి ప్రబలుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తరహా వ్యాధి బారినపడిన 74 మంది చిన్నారుల కేసులను ప్రస్తుతం యూకె స్టడీ చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. హెపటైటిస్ లేదా కాలేయ వాపు లక్షణాలను వీరిలో గుర్తించినట్లు తెలిపింది. ఇదే తరహా కేసులు స్పెయిన్, ఐర్లాండ్ దేశాల్లోనూ బయటపడినట్లు వెల్లడించింది. అమెరికాలోని అలబామాలోనూ ఇలాంటి 9 కేసులను గుర్తించినట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ కేసులపై పరిశోధన చేస్తున్నామని... ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి కేసులు ఉన్నాయో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
గత నెల రోజులుగా ఈ కేసులు పెరుగుతూ వస్తున్నాయని... మున్ముందు మరిన్ని కేసులు నమోదు కావొచ్చునని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అమెరికాలో ఈ వ్యాధి బారినపడిన 1-6 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లల్లో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స అవసరమైందని తెలిపింది. యూకెలో నమోదైన కేసులు కూడా ఇదే వయసు వారిలో గుర్తించినట్లు పేర్కొంది.
ఈ నెల ఆరంభంలో స్కాట్లాండ్‌లో ఇలాంటి 10 కేసులు బయటపడటంతో డబ్ల్యూహెచ్ఓ దీనిపై అలర్ట్ అయింది. ఈ 10 మందిలో ఒకరు ఈ ఏడాది జనవరిలో అనారోగ్యం బారినపడగా... మరో 9 మంది మార్చిలో అనారోగ్యానికి గురయ్యారు. వీరంతా తీవ్ర అనారోగ్యానికి గురికాగా... అందరిలోనూ హెపటైటిస్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే ల్యాబోరేటరీ రిపోర్ట్స్‌లో ఇది హెపటైటిస్‌కి సంబంధించిన వ్యాధి కాదని తేలింది. ఇప్పటివరకూ బయటపడిన కేసుల్లో మరణాలు నమోదు కానప్పటికీ... ఈ వ్యాధి ముదిరితే ప్రాణాంతకమేనని చెబుతున్నారు.
Also Read: Delhi Capitals: ఐపీఎల్ 2022లో కరోనా వైరస్ కలకలం.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు..!
Also Read: Joe Root Captaincy: కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన జో రూట్.. అసలు కారణం అదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook