Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అనుకున్న సమయం కంటే ముందే భూమ్మీదకు రానున్నారు. ఈమెతో పాటు 8 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ కూడా తిరిగి రానున్నారు. ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ సహకారంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరిగి రానున్నారు.
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతోంది. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో గత ఏడాది జూన్ 5న భారతీయ వ్యోమగామి సునీతా విలియమ్స్ సహా మరో ముగ్గురు అంతరిక్షంలో వెళ్లారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం 8 రోజుల్లో తిరిగి వచ్చేయాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపాలు తలెత్తడంతో నిక్ హేగ్, అలెగ్జాండర్ మాత్రమే తిరిగి రాగలిగారు. బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ అక్కడే అంతరిక్షంలో ఉండిపోయారు. ఆ తరువాత ఖాళీ స్పేస్ క్రాఫ్ట్ పంపించి ఈ ఇద్దరినీ వెనక్కి రప్పించేందుకు నాసా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటి నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమ్మీదకు ఎప్పుడొస్తారా అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది.
చివరికి స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ క్యాప్సూల్‌లో ఈ ఇద్దరికి తిరిగి భూమ్మీదకు రప్పించేందుకు మార్గం సుగమమైంది. క్రూ 10 మిషన్‌లో భాగంగా స్పేస్ ఎక్స్ సంస్థ నలుగురు ఆస్ట్రోనాట్స్‌ను అంతరిక్షంలో పంపిస్తోంది. ఈ నలుగురిలో కూడా ఓ భారతీయ ఆస్ట్రోనాట్ ఉన్నారు. ఈ నలుగురు ఐఎన్ఎస్‌కు చేరిన తరువాత ఆక్కడి బాధ్యతలు స్వీకరిస్తారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు డ్రాగన్ క్యాప్సూల్‌లోకి మారతారు. డ్రాగన్ క్యాప్యూల్ ఈ ఇద్దరినీ భూమ్మీదకు క్షేమంగా తీసుకురానుంది. ఈ మొత్తం ప్రక్రియ ఓ వారం రోజుల్లో పూర్తవుతుంది.
వాస్తవానికి స్పేస్‌ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్ మార్చ్ 25న షెడ్యూల్ అయింది. అయితే కొన్ని కారణాలతో మరింత ముందుకు జరిగింది. మార్చ్ 12వ తేదీ బయలుదేరనుందని నాసా వెల్లడించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చ్ 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భూమ్మీదకు అడుగుపెట్టనున్నారు.
Also read: New Chief Election Commissioner: కొత్త ఛీప్ ఎలక్షన్ కమీషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌కు అవకాశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి