Afghanistan Crisis: అఫ్గనిస్థాన్‌లో తీవ్ర ఆహార సంక్షోభం (Afghanistan Crisis) కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సహా పలు దేశాలు మానవతా సాయం కింద అఫ్గనిస్థాన్‌కు ఆహార ధాన్యాలు, సహాయ సామాగ్రిని పంపాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పంపించిన గోధుమలు (Wheat) తినదగినవిగా లేవని, నిరుపయోగకరంగా ఉన్నాయని తాలిబన్లు (Talibans) విమర్శలు గుప్పించారు. అయితే నాణ్యమైన గోధుమలను పంపించిన భారత్ కు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి ఓ తాలిబన్ అధికారి పాకిస్థాన్‌పై విమర్శలు చేస్తున్న వీడియోను అఫ్గన్‌కు చెందిన జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
Indian Wheat Vs Pakistani Wheat!
Recently, India and Pakistan have donated tons of wheat to #Afghanistan in #HumanitarianAID package, now Taliban authorities claim that Pakistani Wheat is rotten and not healthy to be distributed to people while Indian Wheat quality is so good🤔 pic.twitter.com/CQGUalTrjo
— Faiz Zaland (@zalandfaizm) March 4, 2022
ఈ సందర్భంగా ''భారత్ తమ శాశ్వత మిత్ర దేశమని'' కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ''అఫ్గన్ ప్రజలకు ఎల్లప్పుడూ సహకరిస్తున్నందుకు ఇండియాకు ధన్యవాదాలు.. మన ప్రజల మధ్య స్నేహ సంబంధాలు నిరంతరం, శాశ్వతంగా ఇలానే కొనసాగుతాయి.. జైహింద్'' అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. అయితే పాకిస్థాన్‌పై (Pakistan) విమర్శలు గుప్పించిన తాలిబన్ అధికారిని పదవి నుంచి తొలగించినట్లు సమాచారం.
గత నెలలో భారతదేశం (India) అఫ్ఘన్ ప్రజలకు మానవతా సహాయంగా గోధుమలను పంపడం ప్రారంభించింది. రెండో విడతలో 2,000 మెట్రిక్ టన్నుల గోధుమలను అమృత్‌సర్‌లోని అత్తారి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌కు బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. మొత్తం 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపుతామని భారత్ వెల్లడించింది. వీటిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా పంపిణీ చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook