Corona Updates: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ భయాలు- రష్యా, చైనాలో కొత్త కేసుల కలవరం

Covid 19 in Russia: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనక స్థాయిలో విజృంభిస్తోంది. రష్యాలో కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. చైనాను డెల్టా వేరియంట్ భయాలు వెంటాడుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 08:04 PM IST
  • ప్రపంచంపై మళ్లీ కరోనా కోరలు
  • రష్యాలో ఆందోళనకర స్థాయిలో కొవిడ్ కేసులు
  • చైనాను భయపెడుతున్న డెల్టా వేరియంట్​
Corona Updates: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ భయాలు- రష్యా, చైనాలో కొత్త కేసుల కలవరం

Corona Cases Worldwide: ప్రపంచంపై మళ్లీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. వివిధ దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

రష్యా, సింగపూర్​, చైనాలో పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనితో ఆయా దేశాలు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి.

ఈ సారి రష్యా వంతు..

ప్రస్తుతం రష్యాపై కొవిడ్ మహమ్మారి (Corona cases in Russia) ప్రభావం తీవ్రంగా ఉంది. బుధవారం ఒక్క రోజే ఇక్కడ 1,159 మంది కొవిడ్​ కారణంగా (Corona deaths in Russia) మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 2.3 లక్షలకు పెరిగింది. బుధవారం ఒక్క రోజే రష్యా వ్యాప్తంగా 40,096 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య దాదాపు 84 లక్షలకు చేరింది.

ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని మాస్కో (Mascow lockdown) నగరంలో 11 రోజుల సంపూర్ణ లాక్​డౌన్ విధించింది. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే ఇంతకు ముందే ఆ దేశ ప్రభుత్వం ఉద్యోగులకు అక్టోబర్ 30 నుంచి 11 రోజుల పాటు.. వేతనంతో కూడిన సెలవులు ప్రకటించడం గమనార్హం.

చైనాలో మొదలైన కరోనా సంక్షోభం.. కొన్ని నెలల పాటు ఆ దేశాన్ని ఆంక్షల చట్రంలోకి నెట్టింది. ఆ తర్వాత ఇటలీ, స్పెయిన్​, ఇరాన్ వంటి దేశాల్లో విజృంభించింది. ఆ తర్వాత ఆమెరికాలో తన ప్రతాపాన్ని చూపింది.

మన దేశంలో సైతం రెండో దశలో కరోనా ఆందోళనకర స్థాయిలో (Coroan in India) విజృంభించింది. ఈ దశలో దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారింది ఆర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా మళ్లీ లాక్​డౌన్​ విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మన దేశంలో మూడో దశ రావచ్చనే ఆంచనాలు ఉన్నాయి.

Also read: Roh Tae-woo: అనారోగ్యంతో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు మృతి

Also read: Sudan coup: నిరసనలతో అట్టుడుకుతున్న సుడాన్...షాక్ ఇచ్చిన అమెరికా..!

టీకా తీసుకోవడం లేదు..

ప్రస్తుతం రష్యాలో స్పుత్నిక్​ టీకా అందుబాటులో ఉంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టీకాపై ప్రభుత్వం భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే అక్కడి ప్రజలు మాత్రం టీకా తీసుకునేందుకు మొగ్గు చూపడం లేదు. ఇప్పటి వరకు మొత్తం 32 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ మంది టీకా తీసుకోకపోవడం కూడా కేసులు పెరిగేందుకు కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు.

Also read: US: తొలి 'ఎక్స్‌'’ జెండర్‌ పాస్‌పోర్టు జారీ చేసిన అగ్రదేశం

Also read: Cheapest Fuel Price: ఆ దేశంలో అగ్గిపెట్టె డబ్బులతో లీటర్ పెట్రోల్ కొనవచ్చు

చైనాలో మళ్లీ ఆంక్షలు..

ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా కట్టడి పరంగా ముందు వరుసలో ఉన్న చైనాలోనూ మరోసారి కరోనా కేసులు (Corona cases in China) పెరుగుతున్నాయి. కొత్త వాటిలో అధికంగా డెల్టా వేరియంట్ కేసులే (Delta cases in China) ఉండటం మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం.

కేసులు పెరుగుతున్న కారణంగా.. మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకుటోంది చైనా. 40 లక్షల జనాభా కలిగిన లాన్‌ఝువో నగరంలో అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించారు అధికారులు. అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని స్పష్టం చేశారు. చైనాలో ఇప్పటికే 75 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్​ పూర్తయినా.. కొత్త కేసులు పెరుగుతుండటం గమనార్హం. ఈ కారణంగానే 1-2 కేసులు నమోదైనా చైనా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలను తీసుకుంటోంది. లాక్​డౌన్​లు, ప్రయాణ ఆంక్షలను విధిస్తోంది.

Also read: China Delta Variant: చైనాను వెంటాడుతున్న డెల్టా వేరియంట్, పెరుగుతున్న కేసులు

Also read: Horrifying Footage: వ్యక్తిపై మొసలి దాడి.. వీడియో చూస్తే కొన్ని క్షణాలు గుండె ఆగటం ఖాయం

సింగపూర్​లోనూ కేసుల వృద్ధి

సింగపూర్​లోను కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజులోనే 5,324 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఒక్క రోజులో 5 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీనితో మొత్తం కేసులు 184,419కి చేరాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కట్టడి చర్యలపై దృష్టి సారించింది.

బ్రిటన్​లో ay 4.2 వేరియంట్​ కలవరపెడుతోంది. భారత్​లో కూడా ఈ రకం కేసులు వెలుగు చూస్తుండటం గమనార్హం. వీటితో పాటు.. ఇతర దేశాల్లోనూ కరోనా భయాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్​ సహా వివిధ దేసాల్లో టీకా ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఇటీవలే మన దేశంలో 100 కోట్ల డోసుల పంపిణీ మార్క్​ను దాటింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 24.5 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 50 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. 22.2 కోట్ల మంది కొవిడ్​ను జయించారు.

Also read: Hardship of Life: ప్రపంచం కంట కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. గుండె బరువెక్కించే సన్నివేశం

Also read:Saudi Aid To Pak : పాకిస్తాన్ కు భారీ ఆర్థిక సాయం ప్రకటించిన సౌదీ అరేబియా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News