Taliban Kills Pregnant Policewoman: గర్భిణీగా ఉన్న పోలీసును దారుణంగా కాల్చి చంపిన తాలిబన్లు

Taliban Kills Pregnant Policewoman: తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేధించి చంపేస్తున్నారు. ఘోర్‌ ప్రావిన్స్‌లో ఓ మహిళా పోలీసు అధికారిణిని (Policewoman) కూడా అలాగే చంపారు.  ఆమె గర్భిణీ (Pregnant) అని కూడా చూడకుండా కుటుంబం అంతా చూస్తుండగానే ఆమెను కాల్చి చంపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 03:57 PM IST
  • అఫ్గానిస్తాన్‌లో మితిమీరుతున్న తాలిబన్ల అరాచకాలు.
  • వ్యతిరేకించే వారిని వెతికి మరీ పట్టుకుని దాడులు.
  • గర్భిణి అని కూడా చూడకుండా పోలీసు అధికారిణిని కాల్చి చంపిన తాలిబన్లు
Taliban Kills Pregnant Policewoman: గర్భిణీగా ఉన్న పోలీసును దారుణంగా కాల్చి చంపిన తాలిబన్లు

Taliban Kills Pregnant Policewoman: తాలిబన్ల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. తాము మారిపోయని చెప్పిన  తాలిబన్లు మళ్లీ క్రూరత్వాన్నే ప్రదర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేధించి చంపేస్తున్నారు. ఘోర్‌ ప్రావిన్స్‌లో ఓ మహిళా పోలీసు అధికారిణిని (Policewoman) కూడా అలాగే చంపారు.  ఆమె గర్భిణీ (Pregnant) అని కూడా చూడకుండా కుటుంబం అంతా చూస్తుండగానే ఆమెను కాల్చి చంపారు.

ఘోర్‌ ప్రావిన్స్‌లోని ఫిరోజ్‌కోహ్‌కు (Ferozkoh) చెందిన బాను నిగర (Banu Nigara) గత అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వంలో జైలు అధికారిణిగా పని చేసేవారు. తాలిబన్లు అఫ్ఘానిస్థాన్‌ను (Afghanistan) ఆక్రమించుకున్న తర్వాత గతంలో అఫ్గాన్‌ రక్షణదళంతో (Afghan Defense Forces) కలిసి పని చేసిన వారిపై ప్రతీకార దాడులకు దిగుతున్నారు. ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా వెతికి, వెతికి మరీ చంపేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాలిబన్లు బాను ఇంటిపై దాడి చేశారు. ఆమె కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. ఆమె భర్త, పిల్లలు చూస్తుండగానే ఆమెను అతి దారుణంగా కాల్చి చంపేశారు. 

Also read : Panjshir Province: ఆఫ్ఘన్‌లో ముగిసిన ఆధిపత్యపోరు, పంజ్‌షీర్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు

ఈ విషయాన్ని అఫ్గాన్‌ జర్నలిస్టు (Afghan journalist) ఒకరు ట్విటర్‌‌లో పోస్ట్‌ చేశారు. బాను ప్రస్తుతం ఆరు నెలల గర్భిణీ (Six months pregnant). అలాగే పాలుతాగే వయసున్న ఒక చిన్నారికి ఆమె తల్లి కూడా. అయితే, బాను నిగర హత్యను తాము చేయలేదని  తాలిబన్లు (Talibans) చెబుతున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగా ఆమెను ఎవరో చంపి ఉండొచ్చు.. దాన్ని కూడా మాపై వేస్తారా అని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ అన్నారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Also read: Amrullah Saleh: 'అఫ్గాన్‌ మారణహోమాన్ని అరికట్టండి..పంజ్‌ షేర్‌ను కాపాడండి'...ఐరాసకు అమ్రుల్లా సలేహ్‌ విజ్ఞప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News