Boris Johnson: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిజ్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రులంతా వరుసగా తప్పుకోవడంతో విధి లేక తాను కూడా రిజైన్ చేశారు. బోరిస్ జాన్సన్ ను ఈ పరిస్థితి రావడానికి ఆయన వ్యవహారశైలే కారణమైంది. వరుసగా వివాదాల్లోకి చిక్కుకున్నారు జాన్సన్. అనాలోచిత నిర్ణయాలతో జనాల్లో జీరోగా నిలిచారు. జాన్సన్ తీరును అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పోల్చుతారు. ట్రంప్ లానే పిచ్చిపచ్చి పనులతోనే కొంప కొల్లేరు చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కొంత కాలంగా తరుచూ వివాదాల్లో చిక్కుకున్నారు బోరిస్ జాన్సన్. తప్పులు చేయడం తర్వాత సారీ చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. అది మరీ శృతి మించడంతో పదవి కోల్పోయే పరిస్థితి దాపురించింది. బోరిస్ జాన్సన్ తన ఇంటిని అద్భుతంగా ఆధునీకరించుకున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించారు. జాన్సన్ ఇంటి విషయంలో బ్రిటన్ లో పెద్ద దుమారమే రేపింది. ఆరోపణలు తీవ్రంగా రావడంతో ప్రజలకు ఆయనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. జాన్సన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఓవెన్ పాటెర్సన్ అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు లభించడంతో పార్లమెంట్ స్టాండర్డ్ కమిటీ అతనిపై సస్పెండ్ వేటు వేసింది. అయితే పాటెర్సన్ సస్పెన్షన్ అపడానికి జాన్సస్ ప్రయత్నించారు. ఇది కూడా రచ్చగా మారింది. దీంతో జాన్సన్ మరోసారి క్షమాణలు చెప్పారు.
ఇక కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో జాన్సన్ తీరు తీవ్ర విమర్శల పాలైంది. ప్రజలంతా వైరస్ భారీన పడి ఇబ్బందుల్లో ఉంటే బోరిస్ జాన్సన్ మాత్రం గ్రాండ్ గా బర్త్ డే వేడుకలను నిర్వహించుకున్నారు. కరోనా సమయంలో బ్రిటన్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ చనిపోయి దేశమంతా విషాదంలో ఉన్న సమయంలోనే జాన్సన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదమైంది. జాన్సన్ తీరుపై జనాలు భగ్గుమన్నారు. దీంతో దిగొచ్చిన బోరిస్ జాన్సన్ బ్రిటన్ రాణికి జాన్సన్ క్షమాపణ చెప్పారు. ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ గా క్రిస్ పించర్ ను నియమించడం జాన్సన్ ను ఇరుకున పెట్టింది. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే క్రిస్ పించర్ ను ఎలా నియమిస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.తర్వాత జాన్సన్ అతని నియమకంపై వెనక్కి తగ్గినా అప్పటికే ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, బోరిస్ జాన్సన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో కొందరు మంత్రులు తమ పదవులు పోగొట్టుకున్నారు.
బోరిస్ జాన్సన్ తీరుతో ఆయన ప్రభుత్వమే కాదు ఆయన పార్టీ కూడా కష్టాల్లో పడింది. కన్జర్వేటివ్ పార్టీ నేతలపైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. మంత్రులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బ్రిటన్ లో సంచలనమైంది. జాన్సన్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా పార్లమెంట్ లోనే బ్లూ ఫిల్మ్ చేస్తూ దొరికిపోయారు. ఈ ఘటనతో జాన్సస్ సర్కార్ పరువు పోయింది. ఓ ఎంపీ 15 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి చేశారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపగా.. అతన్ని తప్పించారు. మొత్తంగా బోరిస్ జాన్సన్ ఎపిసోడ్ తో అతన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో పోల్చుతున్నారు.
Also Read: Heavy Rains: తెలంగాణలో కుండపోత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. వరదలతో ఖమ్మం, సూర్యాపేట అతలాకుతలం
Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook