సునామీ ఎఫెక్ట్: తీరప్రాంతాలకు వెళ్ల వద్దని హెచ్చరికలు జారీ

Last Updated : Dec 27, 2018, 12:13 PM IST
సునామీ ఎఫెక్ట్: తీరప్రాంతాలకు వెళ్ల వద్దని హెచ్చరికలు జారీ

ఇండోనేషియాలో మరో సునామీ భయం వెంటాడుతూనే ఉంది. అనక్ క్రకటోవ పర్వతం ఇంకా రగులుతూనే ఉంది. లావా స్థాయి క్రమ క్రమంగా పెగుతుండటంతో మళ్లీ సునామీ సంభవించవచ్చని తుఫాను హెచ్చరికల కేంద్రం  అంచనా వేస్తోంది. ఎందుకైనా మంచిదని అధికారులు ముందస్తు జాగ్రత్తులు తీసుకుంటారు. తీర ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా ఇండోనేషియా తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎవరూ తీరప్రాంతాలకు వెళ్ల వద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు

అత్యవసరం స్థితి ప్రకటన
మరోవైపు నాలుగు రోజుల క్రితం సునామీ సృష్టించిన బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన బాధితుల విషయంలో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. పలు చోట్ల అంటువ్యాధులు ప్రబలడంతో వైద్య సేవలు ముమ్మరం చేశారు. ఆర్మీ సిబ్బంది సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వం జనవరి 4 వరకు దేశంలో అత్యవరసర పరిస్థితి ప్రకటన చేసింది

Trending News