WHO: వేగవంతమైన సామాజీకరణ వల్ల పెను ముప్పు తప్పదు

కరోనావైరస్ ( Coronavirus ) ప్రభలుతున్న సమయంలో పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదరకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) హెచ్చరించింది

Last Updated : Sep 1, 2020, 02:44 PM IST
    • కరోనావైరస్ ప్రభలుతున్న సమయంలో పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదరకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.
    • భారత దేశంలో అన్ లాక్ 4 ప్రారంభం అవుతున్న సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ టెడ్రోస్ ఆధ్నామ్ ఘాబ్రియోసిస్ హెచ్చరించారు.
    WHO: వేగవంతమైన సామాజీకరణ వల్ల పెను ముప్పు తప్పదు

    కరోనావైరస్ ( Coronavirus ) ప్రభలుతున్న సమయంలో పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదరకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) హెచ్చరించింది. భారత దేశంలో అన్ లాక్ 4 ప్రారంభం అవుతున్న సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ టెడ్రోస్ ఆధ్నామ్ ఘాబ్రియోసిస్ ( Tedros Adhanom Ghebreyesus ) హెచ్చరించారు.

    ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 25.6 మిలియన్లకు చేరుకుంది. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల 54 వేల మంది వైరస్ వల్ల మరణించారు. రోజు రోజుకూ కేసుల సంఖ్య మరింతగా పెరగుతోంది. 

    ఇలాంటి సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ను ఎత్తేసి సాధారణ, పూర్వ పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా టెడ్రోస్ ఆధ్నామ్ ఒక వీడియో విడుదల చేశారు. గత ఆరునెలలుగా ఆ మహమ్మారితో కలిసి పోరాడుతున్నాము. పోరాటం చాలు అని చాలా మంది సాధారణ పరిస్థితికి వెళ్లిపోతున్నారు. కానీ కరోనా మహమ్మారి ఆట ముగిసింది ఏ దేశమూ నిర్ధారించలేదు అని ఆయన వీడియోలో మాట్లాడారు.

     

    Trending News