Who Is Parag Agrawal: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ (Twitter New CEO Parag) నియామకం జరిగింది. ఇప్పటి వరకు ఆ కంపెనీకి సీఈఓగా పనిచేసిన జాక్ డోర్సే (Twitter Jack Dorsey).. ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ) గా ఉన్నారు. అయితే ఇంతకీ భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్.. ట్విట్టర్ సీఈఓ బాధ్యతల వరకు ఎలా చేరుకున్నాడో తెలుసా?
దిగ్గజ సంస్థల్లో భారతీయులు..
దిగ్గజ కంపెనీల్లో సీఈఓలుగా భారతీయులు నియామకం అవ్వడం ఇదే తొలిసారి కాదు. అంతకు ముందు. గూగుల్, మైక్రో సాఫ్ట్, అడోబ్, ఐబీఎమ్, పాలో ఆల్టో నెట్ వర్క్స్ తర్వాత ఇప్పుడు ట్విట్టర్ సీఈఓగానూ ఓ భారతీయుడు నియామకం అవ్వడం విశేషం.
గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్.. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల.. అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్.. ఐబీఎమ్ సీఈఓగా అరవింద్ కృష్ణ.. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓగా నికేశ్ అరోరా తర్వాత చివరగా ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ గా పనిచేస్తున్నారు.
అయితే అంతకు ముందు ట్విట్టర్ సీఈఓగా పని చేసిన జాక్ డోర్సే ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వ్యాపించిన కొన్ని గంటల్లోనే.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు డోర్సే ప్రకటించారు. దాదాపుగా 16 ఏళ్లు ఆ పదవిలో పనిచేసిన డోర్సే.. ఇప్పుడు సీఈఓగా తప్పుకోవడం గమనార్హం. ఆయన తర్వాత ట్విట్టర్ సీఈఓగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నాయకత్వం వహించనున్నారు.
పరాగ్ అగర్వాల్.. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్.. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సటీలో పీహెచ్‌డీ చదువుకున్నారు. 2011లో అగర్వాల్ ట్విట్టర్లో చేరారు. అపుడు 1000 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థ అది. 2017 నుంచి సీటీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు అదే కంపనీకి సీఈఓగా ఎదిగారు.
ట్విట్టర్ సీఈఓగా నియామకంపై స్పందించిన పరాగ్ అగర్వాల్ (Twitter New CEO Parag).. “ఈ పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా డోర్సేకి (Twitter Jack Dorsey) కృతజ్ఞతలు. మీ మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని ఆశిస్తున్నా” అని పేర్కొన్నారు.
Also Read: 1 Crore Lottery Winner: ఆరు రూపాయలు ఖర్చు పెట్టి రూ.కోటి గెలుచుకున్నాడు!
Also Read: Twitter CEO Jack Dorsey: సీఈఓ జాక్ డోర్సీ నుంచి CTO Parag Agrawal కి సీఈఓ బాధ్యతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Who Is Parag Agrawal: ఈ పరాగ్ అగర్వాల్ ఎవరు?- టాప్-5 దిగ్గజ కంపెనీల్లో ఇండియన్స్ హవా?