Ban on Israelis: ఈ 12 దేశాల్లో ఇజ్రాయిల్ పౌరులకు నో ఎంట్రీ, ఇదే జాబితా

Ban on Israelis: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావం ప్రపంచ ముస్లిం దేశాలపై తీవ్రంగానే ఉంది. ఇజ్రాయిల్ దేశంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఫలితంగా కొన్ని దేశాలు ఇజ్రాయిల్ పౌరులకు నో ఎంట్రీ ప్రకటించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2024, 05:06 PM IST
Ban on Israelis: ఈ 12 దేశాల్లో ఇజ్రాయిల్ పౌరులకు నో ఎంట్రీ, ఇదే జాబితా

Ban on Israelis: హమాస్‌పై యుద్ధం కారణంతో పాలస్తీనాపై జరుగుతున్న దాడులతో ప్రపంచ ముస్లిం దేశాల్లో  ఇజ్రాయిల్ అంటే వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఇజ్రాయిల్ పాస్‌పోర్ట్ కలిగినవారికి అనుమతించని దేశాల జాబితా ఇది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ జారీ చేసిన ఈ జాబితానే ఇప్పుడు వైరల్ అవుతోంది. 

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ ఇజ్రాయిల్ దేశానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాన్ని పోస్ట్ చేసింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపధ్యంలో ప్రపంచంలో మారిన పరిస్థితులకు ఈ పోస్ట్ అద్దం పడుతోంది. ముఖ్యంగా ప్రపంచ ముస్లిం దేశాల్లో ఇజ్రాయిల్ దేశం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. అల్జీరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, లెబనాన్, కువైట్, లిబియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, సిరియా, యెమెన్ వంటి ముస్లిం ప్రాబల్య దేశాలు ఇజ్రాయిల్ పౌరులకు తమ దేశంలో నో ఎంట్రీ విధించాయి. ఆ జాబితానే ఇది. 

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ జారీ చేసిన ఈ జాబితాపై ఇజ్రాయిల్ స్పందించింది కూడా. వి ఆర్ గుడ్ అని వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఇజ్రాయిల్ దేశం ప్రకారం లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ దేశాలు ప్రత్యర్ధి దేశాలు. ఈ దేశాలకు వెళ్లాలంటే ఇజ్రాయిల్ పౌరులు తమ దేశ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. యూఏఈ మాత్రం ఇజ్రాయిలీలకు వీసా రహిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తోంది. ఈ పోస్టుపై పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమౌతోంది. కొందరు ఇజ్రాయిల్ దేశాన్ని ద్వేషిస్తుంటే మరి కొందరు మద్దతిస్తున్నారు. 2024 నాటికి ఇజ్రాయిల్ పాస్‌పోర్ట్ కలిగిన పౌరులకు 171 దేశాలు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించాయి. ఇజ్రాయిల్ పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులు యూరోపియన్ యూనియన్ దేశాలు, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణించవచ్చు. చైనా, ఇండియా, అమెరికా దేశాలకు మాత్రం వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. 

Also read: Penny Wong: మహిళను పెళ్లి చేసుకున్న మహిళా మంత్రి.. తొలి స్వలింగ పెళ్లితో రికార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News