APPSC Notification 2024: ఏపీలో ఇప్పుడు వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్, ఇప్పుుడు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు వరుస గుడ్‌న్యూస్‌లు అందుతున్నాయి. తాజాగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 240 లెక్చరర్ పోస్టుల భర్తీకై ఈ నోటిఫికేషన్ వెలువడింది. https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవల్సి ఉంటుంది. మొత్తం 240 ఖాళీల్లో బోటనీ 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 18, హిస్టరీ 19, మేథ్స్ 17, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21 జువాలజీ 19 ఖాళీలున్నాయి. అయితే ఈ ఖాళీల్ని జోన్ వారీగా విభజించారు. జోన్ 1లో 68, జోన్ 2లో 95, జోన్ 3లో 50, జోన్ 4లో 77 ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కావల్సిన అర్హత సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. పీహెచ్‌డి, నెట్, స్లెట్, సెట్ ఉత్తీర్ణులవ్వాలి. వయస్సు కూడా 42 ఏళ్ల వరకూ అనుమతి ఉంటుంది. 2023 జూలై 1 నాటికి 18-42 ఏళ్ల మధ్యలో ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష ఉంటుంది. ఇందులో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది.
ఇక పరీక్ష అయితే మొత్తం 450 మార్కులకు ఉంటుంది. ఇందులో పేపర్ 1 నుంచి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ విభాంగోల 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. ఇక సంబంధిత సబ్జెక్ట్ నుంచి 150 ప్రశ్నలకు 300 మార్కులుంటాయి. ప్రతి పేపర్‌కు సమయం 150 నిమిషాలుంటుంది.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. జనవరి 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 13 చివరి తేదీ. ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులకు జీతం 57,700 రూపాయల్నించి 1,82, 400 రూపాయలుంటుంది.
Also read: Citroen C3 Aircross Launch: సిట్రోయెన్ సి3 కొత్త కారు లాంచ్, ధర, మైలేజ్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook