AP Cabinet Decisions: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల హామీల్లో ముఖ్యమైన రెండు పధకాల అమలుకు ముహూర్తం ఖరారు చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పధకాల అమలుపై నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పధకం అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చే విద్య సంవత్సరం నుంచి ఈ పధకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా రైతుల కోసం ఉద్దేశించిన అన్నదాత సుఖీభవ పధకంపై మార్గదర్శకాలు నిర్ణయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న మూడు నెలలు ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు మంత్రుల్ని ఆదేశించారు. మరి కొన్ని కీలక నిర్ణయాలు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీలకు కేటాయించేలా నిర్ణయమైంది. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలనే గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రంలో 40 వేల కోట్లకు పైగా పౌర, పవన ఇంధన రంగంలో పెట్టుబడులు రానున్నాయని మంత్రి పార్ధసారధి వివరించారు. వీటి ద్వారా 19 వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల నిర్మాణనికి కొత్త టెండర్లు పిలుస్తున్నామన్నారు. \
Also read: Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలెండర్ కోసం అప్లై చేసుకున్నారా, మరో ఛాన్స్ ఉంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి