Ap govt cancels inter first year exams: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి.. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ లను నిర్వహించడంలేదని కూడా ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ క్రమంలో సర్కారు తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక్కసారిగా వార్తలలో నిలిచింది.
ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ బోర్డు ఎగ్జామ్ లను నిర్వహిస్తుంటారు. ఎగ్జామ్ ల ఒత్తిడి వల్ల విద్యార్థులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని.. అనేక మంది విద్యార్థులు కూడా సూసైడ్ లు చేసుకున్న ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ సర్కారు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ లను రద్దు చేయడం మాత్రం వార్తలలో నిలిచింది.
ఏపీ, తెలంగాణలో తప్ప.. మిగత ఏ ఇతర రాష్ట్రాలలో కూడా.. బోర్డులు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ లను నిర్వహించడంలేదని తెలుస్తొంది. అదే విధంగా చాలా బోర్డులు ఇంటర్ మొటి సంవత్సరం ఫలితాలను కూడా అంతగా ప్రామాణికంగా తీసుకోవు. ఈ నేపథ్యంలో.. మొదటి సంవత్సరం ఫలితాల్లో పట్టు సాధిస్తే.. రెండో ఏడాది సబ్జెక్టులపై పట్టు సాధించడం ఈజీ అవుతుందని కూడా ఇంటర్ బోర్డ్ భావిస్తుందని తెలుస్తొంది.
Read more: Prayagraj Kumbh Mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు బయలు దేరిన తిరుమల శ్రీవారి కళ్యాణ రథం..
దీంతో.. నీట్, జేఈఈ ఎగ్జామ్ లలో.. సక్సెస్ అవుతారని కూడా ఇంటర్ బోర్డ్ భావిస్తుందని సమాచారం. ఈ క్రమంలో.. వచ్చే విద్యా సంవత్సరం.. 2025-26 నుంచి ఇక మీదట ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ లు ఉండవని తెలుస్తొంది. అదేవిధంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎన్ సీఈఆర్ టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశ పెట్టాలని ఇంటర్ బోర్డ్ భావిస్తున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter