Ssc Exam Papers Leak: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. పరీక్ష మొదలు కాగానే రోజు ఏదో ఒక చోట ప్రశ్నాపత్నం బయటికి వస్తోంది. నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా రాష్ట్రం మొత్తం చక్కర్లు కొడుతోంది. ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థులు పరేషాన్ అవుతున్నారు. జగన్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, పరీక్షలు కూడా సాఫీగా నిర్వహించలేకపోతుందని టీడీపీ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతోంది. లీకేజీల నివారణకు కఠిన చర్యలకు దిగింది. అయినా ప్రశ్నాపత్రాలు బయటికి వస్తూనే ఉన్నాయి.
తాజాగా ప్రశ్నాపత్రాల లీకేజీలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై నింద వేయడానికే కొందరు కావాలని ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో పర్యటించిన సీఎం జగన్.. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. బటన్ నొక్కి స్టూడెంట్స్ తల్లుల ఖాతావ్వో 709 కోట్ల రూపాయలను జమ చేశారు సీఎం జగన్. 2022 జనవరి- మార్చి నెలలకు గాను దాదాపు 10 లక్షల 85 వేల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద సాయం అందింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్.. టెన్త్ పేపర్ల లీకేజీలపై స్పందించారు. టీడీపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
గత టీడీపీ ప్రభుత్వం స్కూళ్లను క్లోజ్ చేయాలని చూస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మార్చేశామని చెప్పారు జగన్. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని తెలిపారు. నాడు- నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశామన్నారు సీఎం. స్కూళ్లు బాగుపడటంతో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో టీడీపీ కుట్రలు చేస్తోందని సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లపై మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తుందని విమర్శించారు. అంతటితో ఆగకుండా ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తమకు అనుకూలంగా ఉన్న స్కూళ్ల నుంచి టీడీపీనే టెన్త్ పేపర్లు లీక్ చేయిస్తుందని... ప్రభుత్వాన్ని నిందిస్తోందని సీఎ జగన్ ఆరోపించారు. దొంగే దొంగా అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ తీరు ఉందన్నారు. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలకు సంబంధించి సీఎం జగన్మోగన్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. టీడీపీనే పేపర్లు లీక్ చేస్తుందన్న జగన్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
READ ALSO: Power Crisis:ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. దేశంలో 1100 రైళ్లు రద్దు!
Nellore: తిరుపతి ఘటన మరవకముందే.. నెల్లూరులోనూ సేమ్ సీన్... బైక్‌పై బాలుడి మృతదేహం తరలింపు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.