CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రాత్రి 9.15 గంటలకు హస్తినకు చేరుకుంటారు. రాత్రికి జన్‌పథ్ వన్‌లోని నివాసంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారంపై మంతనాలు జరపనున్నారు.
పోలవరం నిధులు, ఆర్ అండ్ అర్ ప్యాకేజీపై ప్రధానితో చర్చించనున్నారు. వీటితోపాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వెంటనే పరిష్కారం చూపేలా చొరవ తీసుకోవాలని కోరనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధనే లక్ష్యంగా భేటీ సాగనుంది. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధాని మోదీకి విన్నవించనున్నారు.
ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా జల్ శక్తి మంత్రి షెకావత్‌తో మంతనాలు జరపనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేలా చొరవ తీసుకోవాలని కోరనున్నారు. ప్రస్తుత ఖర్చుకు అనుగుణంగా నిధులు కేటాయించాలన్న వినతిపత్రం అందజేయనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రా భవన్ అధికారులు..అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతకొంతకాలంగా ఏపీ, తెలంగాణ మధ్య పోలవరంపై వార్ కొనసాగుతోంది. ఇటీవల గోదావరికి వరదలు సంభవించాయి. భద్రాచలం, పరిసర ప్రాంతాలు ముంపునకు గురైయ్యాయి. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. దీనితోపాటు ముంపు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వం ఘాటు కౌంటర్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు, వరదలకు సంబంధం ఏంటని మంత్రులు మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య కొత్త వివాదాన్ని తీసుకురావొద్దని కౌంటర్ ఇచ్చారు. తాము విభజన వల్ల నష్టపోయామని..ముంపు గ్రామాలను తెలంగాణ అడిగితే..తాము హైదరాబాద్‌ను అడుగుతామని ఫైర్ అయ్యారు. ఈక్రమంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యే విధంగా చూడాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరనుంది.
Also read:Crime News: పెద్దపల్లి జిల్లాలో భర్తను చంపించిన భార్య..పోలీసుల దగ్గర కీలక విషయాలు..!
Also read:IND vs ZIM: రేపే భారత్, జింబాబ్వే మధ్య చివరి వన్డే..రిజర్వ్ బెంచ్‌కు అవకాశం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి