Ap Government: కోవిడ్ మహమ్మారి ఎందరో జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా బారినపడి పేద, మధ్య తరగతి ప్రజల కుటుంబాలు చితికిపోతున్నాయి. తల్లిదండ్రులు కోల్పోయి పిల్లలు అనాధలవుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది.
కరోనా మహమ్మారి (Corona pandemic) తీవ్రంగా విజృంభిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం (Ap govenrment) కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కోవిడ్ చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సను సైతం ఆరోగ్య శ్రీలో చేర్చింది. కరోనా సెకండ్ వేవ్ ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అనేకమంది మృత్యువాత పడుతున్నారు. తల్లిదండ్రులు ఒకేసారి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు అనాథలవుతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక పథకాన్ని ప్రవేశపెట్టింది.
కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( Ap cm ys jagan) అభయ హస్తం అందిస్తున్నారు. పిల్లల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ఏకే సింఘాల్ తెలిపారు. ఆ మేరకు తదుపరి ఉత్తర్వులను రేపు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల (Ten lakhs for orphaned children)పేరు మీద 10 లక్షలు డిపాజిట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డిపాజిట్ పై వచ్చే వడ్డీని ప్రతి నెలా ప్రతి నెలా పిల్లలకు అందజేయనున్నమని సింఘాల్ పేర్కొన్నారు. ఆ పిల్లలకు 25ఏళ్లు వచ్చేవరకూ ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పిల్లలకు వారికి 25ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుంది. దీనికోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పారు.
Also read: Aarogyasri: బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook