అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. కరోనా సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనకడుగు వేయకుండా ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కాపు మహిళల అభ్యున్నతి కోసం ‘వైఎస్సార్ కాపు నేస్తం’(YSR Kapu Nestham Scheme) పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జూన్ 24న తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. తమ జవాన్ల మరణాలపై నోరు విప్పిన చైనా
కాపు మహిళలకు అండగా నిలిచేందుకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ (YSR Kapu Nestham) పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో అర్హులైన కాపు ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,35,873 లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. సుమారు రూ.354 కోట్లను నేరుగా కాపు మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఒక్క బటన్ నొక్కడం ద్వారా అర్హులైన మహిళలందరి ఖాతాల్లో రూ.15 వేలు జమ అవుతాయి. తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
వైఎస్సార్ కాపు నేస్తం వర్తించేందుకు అర్హతలు... (Eligibility For YSR Kapu Nestham)
- కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించకూడదు.
- ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట (ఖుష్కి) భూమి ఉండాలి. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.
- అదే పట్టణ ప్రాంతాల వారికి అయితే ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు, ఇతర ఏ నిర్మాణాలు ఉండకూడదు.
- ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలాగే ప్రభుత్వ పెన్షన్ కూడా పొందరాదు.
- ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఉండనుంది.
- ఆ కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారులై ఉండకూడదు జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ