Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?

Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 15, 2024, 11:33 PM IST
Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?

Pawan Kalyan: తెలంగాణలో జరిగిన అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టి సనాతన ధర్మం రక్షణ కోసం ఉద్యమిస్తానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం దుర్మార్గం అని మండిపడ్డారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Ticket Price: సినిమా టికెట్‌ ధరలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సంచలన ప్రకటన

 

హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. విగ్రహం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. హిందూత్వ సంఘాలు ఈ సంఘటనను ఖండిస్తున్నారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సంఘటనలో కొందరిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Also Read: ED Attaches: నైపుణ్యాభివృద్ధి కుంభకోణంలో చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన ప్రధాని మోదీ

ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 'ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఆవేదనకు గురి చేసింది. ఇది దుర్మార్గం. మహాపచారం. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతానికి సంబంధించిన వారైనా సామూహికంగా కాపాడుకోవాలి. ఈ బాధ్యతను ప్రభుత్వాలు మీదనో, పోలీసుల మీదనో వేసి మనం బాధ్యత నుంచి దూరంగా ఉండరాదు' అని పేర్కొన్నారు.

'ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో  ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశాను. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలను అపవిత్రం చేయడం అలవాటుగా మారింది. ఇలాంటి సంఘటనలను చూసీ చూడనట్లు వదిలేస్తే అది విపరీత పోకడలకు దారి తీస్తుంది. అదుపు తప్పుతుంది' అని పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇలాంటి దుర్మార్గాలపై చాలా కఠిన చర్యలు అవసరం. తిరుపతిలో జరిగిన సభలో వారాహి డిక్లరేషన్‌లో చెప్పాను. ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News