గుంటూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కోడెల శివప్రసాద రావు సమీప బంధువు ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం శ్రీలక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది. వెంటిలేటర్‌పై ఉంచి కోడెలకు చికిత్స అందిస్తున్నట్టు ఆయన బంధువు వెల్లడించారు. కోడెల శివప్రసాద రావు ఆరోగ్య పరిస్థితిపై ఆయన అనుచరులు, టీడీపి కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలావుంటే, ప్రభుత్వం తీసుకొస్తున్న రకరకాల ఒత్తిళ్ల వల్లే ఆయన అనారోగ్యం బారిన పడ్డారని టీడీపి నేత ఆనంద బాబు ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోడెలను పరామర్శించిన అనంతరం నక్కా ఆనంద బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.