Curfew in AP: నైట్ కర్ఫ్యూను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కొనసాగనున్న కర్ఫ్యూను ఈనెల 21 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు(Covid Cases) స్థిరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. శనివారం ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అనంతరం రాత్రి పూట కర్ఫ్యూ(Night Curfew) పొడిగించాలని ఈ మేరకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జన సమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయన్నారు.
Also Read: Karnataka: రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ ఆంక్షలకు సిద్ధమౌతున్న ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు(Covid tests) నిర్వహించగా.. కొత్తగా 1,535 మందికి పాజిటిన్ గా తేలింది. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా(Corona) నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook