AP Free Bus Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకు తగ్గట్టే వివిధ సంక్షేమ పధకాలు ఒక్కొక్కటి అమలు చేసేందుకు ప్రభుత్వ సిద్ధమౌతోంది. ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యమైన హామీగా నిలిచిన ఫ్రీ బస్సు కోసం చర్చ నడుస్తోంది.
ఏపీలోని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వివిధ హామీల్లో ఒకటి ఉచిత బస్సు పధకం. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా పధకం కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో అమలవుతోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటింది. ఈ పథకం ఏపీలో అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే అమలు కావల్సి ఉంది. కానీ ఆలస్యమైంది. ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధికారులు పరిశీలించారు. రాష్ట్రంలో ఎలా అమలు చేయాలో తగిన కార్యాచరణ రూపొందించారు. దీపావళికి తరువాత సంక్రాంతికి ప్రారంభించవచ్చని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఉగాదికి ఈ పధకం అమలు చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పధకం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మరోవైపు ప్రతిపక్షాల నుంచి ఫ్రీ బస్సు హామీ ఏమైందంటూ విమర్శలు చేస్తున్నారు. కీలకమైన మంత్రులతో ఈ పధకంపై చర్చ సాగింది. మహిళలు అందరికీ ఈ పధకం అమలు చేస్తారా లేక అర్హత ఆధారంగా నిర్ణయిస్తారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏమైందంటూ పెద్దఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో త్వరలోనే ఈ పధకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాదికి ఈ పథకానికి శ్రీకారం చుట్టవచ్చని తెలుస్తోంది.
Also read: Flight Luggage Rules: కొత్త విమానం లగేజ్ రూల్స్ , ఎన్ని ఎలాంటి బ్యాగ్‌లకు అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.