AP Government: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాలకు తాము హాజరుకావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో అతనిని ఇరుకునపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రయత్నం సరైందో కాదో తెలుసుకుందాం.
కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను జత చేస్తూ సభకు రానివారి సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కూటమి ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తోంది. సభకు హాజరు కాకపోతే సభ్యత్వాలను రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉందనేది ఆ లేఖ సారాంశం. 11మంది సభ్యత్వాలను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా ఉండాలని లేఖలో వివరించినట్టు సమాచారం. ఈ చర్య ద్వారా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగేసినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టవచ్చనేది కూటమి నేతల ఆలోచన.
అయితే కూటమి నేతల ఆలోచన బెడిసి కొట్టే పరిస్థితి కన్పిస్తోంది. ఎందుకంటే గవర్నర్‌కు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే అధికారం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 నుంచి 195 వరకూ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించడం, కార్యకలాపాలను పర్యవేక్షించడం మాత్రమే గవర్నర్ చేయవచ్చు. సభ్యుల సభ్యత్వాలు రద్దు చేసే అధికారం గవర్నర్ పరిధిలో లేనే లేదు. ఈ విషయం తెలిసే కూటమి ఈ ప్రయత్నం చేసిందా లేక తెలియక చేసిందా అనేది తెలియదు. ఈ రెండింట్లో ఏది జరిగున్నా కూటమి ఆలోచన తప్పనేది అందరికీ తెలుస్తోంది.
Also read: AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.