Ambati Rambabu: పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చకు రావాలి..టీడీపీ నేతలకు అంబటి రాంబాబు సవాల్..!

Ambati Rambabu: గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్‌పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 18, 2022, 03:34 PM IST
  • వరదలు తగ్గుముఖం
  • ముమ్మరంగా సహాయక చర్యలు
  • పోలవరంపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
Ambati Rambabu: పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చకు రావాలి..టీడీపీ నేతలకు అంబటి రాంబాబు సవాల్..!

Ambati Rambabu: పోలవరంలో కాఫర్‌ డ్యామ్‌ డిజైన్‌ను పక్కాగా చేశామన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎంత వరద వచ్చినా తట్టుకునేలా తయారు చేశామని స్పష్టం చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మాజీ మంత్రి దేవినేని ఉమ గానీ..టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కానీ చర్చకు రావాలన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు

మేధావి, జ్ఞానవంతుడు అయిన దేవినేని ఉమ సమాధానం చెప్పాలన్నారు. ఆరోగ్యకరమైన చర్చకు రావాలన్నారు మంత్రి అంబటి రాంబాబు. డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. 1986 తర్వాత గోదావరికి వరదలు వచ్చాయని గుర్తు చేశారు. ముంపు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం భారీగా మోహరించిందని..ఎన్నడూ లేనివిధంగా సహాయక చర్యలు సాగుతున్నాయని స్పష్టం చేశారు. భద్రచాలం సైతం పూర్తిగా మునిగిపోయిందన్నారు. వరద ప్రాంతాలకు సీఎం జగన్ వెళ్లి ఆర్భాటాలు చేయలేదని..ప్రజలతో మమేకం అయ్యారని గుర్తు చేశారు. 

Also read:CM Jagan: వరద బాధితులకు తక్షణ సాయం అందించాలి..కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం..!

Also read:Vijayendra Prasad: రాజ్యసభలో ఎంపీగా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News