AP: నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: మంత్రి కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్  స్థానిక సంస్థల ఎన్ని కల పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తుండటం వివాదానికి దారి తీస్తోంది. మంత్రి కొడాలి నాని నిమ్మగడ్డపై మరోసారి విరుచుకుపడ్డారు.

Last Updated : Nov 18, 2020, 11:58 AM IST
  • ఏపీ ప్రభుత్వానికి ..ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు మరోసారి వివాదం
  • స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధంగా లేమంటున్న రాష్ట్ర ప్రభుత్వం
  • నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి అంటూ విమర్శించిన మంత్రి కొడాలి నాని
AP: నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: మంత్రి కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్  స్థానిక సంస్థల ఎన్ని కల పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తుండటం వివాదానికి దారి తీస్తోంది. మంత్రి కొడాలి నాని నిమ్మగడ్డపై మరోసారి విరుచుకుపడ్డారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ( Ap Local Body Elections ) నిర్వహణ మరోసారి వివాదానికి కేంద్రబిందువుగా మారుతోంది. కరోనా సంక్రమణ దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) సిద్ధంగా లేకపోయినా...ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికల నిర్వహించాలనే అంటున్నారు. ఇదే విషయం ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య మరోసారి వివాదాన్ని రాజేస్తోంది. ఇప్పుడిదే విషయాన్ని మంత్రి కొడాలి నాని ( Ap minister kodali nani ) మరోసారి స్పష్టం చేశారు. అటు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేశారు. 

రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Ap state Election commissioner Nimmagadda Ramesh kumar )..చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించానుకోవడం సిగ్గు చేటని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని చెప్పారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా..హుందాగా వ్యవహరించాలని కోరారు. కరోనా సంక్రమణ ఉన్నా..ఎన్నికలు నిర్వహిస్తాననడం అవివేకమన్నారు. హైదరాబాద్ లో కూర్చునే నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి అని మంత్రి కొడాలి నాని సెటైర్ విసిరారు. జూమ్ బాబుతో కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా చేస్తానంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి నాని స్పష్టం చేశారు. Also read: AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గదు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

 

Trending News