AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. వరుసగా నాలుగవ రోజు కూడా ఏపీలో 4 శాతం కేసులే నమోదయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి ఇప్పుడు ఏపీలో దాదాపుగా తగ్గింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు తగ్గడంలో ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ వేళల్ని మరింతగా సడలించింది ప్రభుత్వం. గత 24 గంటల్లో ఏపీలో 90 వేల 574మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించగా..3 వేల 841 కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడిలో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ సత్పలితాలనిస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 లక్షల 93 వేల 354 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం 38 వేల 178 యాక్టివ్ కేసులు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. మిగిలిన 18 లక్షల 42 వేల 432 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 38 మంది కరోనా కారణంగా మృతి చెందగా..మొత్తం రాష్ట్రంలో 12 వేల 74 మంది మరణించారు. నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 3 వేల 963 మంది కోలుకున్నారు.
గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 760 కేసులు, చిత్తూరులో 616, కృష్ణా జిల్లాలో 350, పశ్చి మ గోదావరి 504 కేసులు నమోదయ్యాయి.
Also read: Ysr Bima Scheme: వైఎస్ఆర్ బీమా పథకం కొత్త మార్గదర్శకాలివే..ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook