AP SSC Exams 2024: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో కీలక మార్పులు చేసింది ఏపీ విద్యాశాఖ. ఇప్పటి వరకూ పదవ తరగతి పరీక్షలో ఉండే ఆరు పేపర్లకు బదులు 7 పేపర్లు ఉంటాయి. దీంతోపాటు తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం విధానం మారుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
ఏపీ విద్యాశాఖ పదవ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం విధానంలో మార్పులు చేపట్టింది. ఇప్పటి వరకూ అంటే 2022-23 వరకూ పదవ తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి 7 పేపర్లు చేయాలని నిర్ణయించింది విద్యాశాఖ. సైన్స్ పేపర్‌లో ఇప్పటి వరకూ భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు కలిపి ఒకే పేపర్ గా ఉంటుంది. ఇక నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 50 మార్కులకు ఒక పేపర్ ఉంటుంది. బయోలజీ మరో 50 మార్కులకు మరో పేపర్ ఉంటుంది. రెండు పేపర్లలో చెరో 17 ప్రశ్నలుంటే..రెండూ కలిపి 35 మార్కులొస్తే పాస్ ఉంటుంది.
సైన్స్ పేపర్ రెండు రోజులు జరిగినా ఒక్కో పేపర్‌కు 2 గంటల సమయమే ఉంటుంది. మిగిలిన ఐదు సబ్జెక్టుల్లో ఒక్కో పేపర్‌కు వంద మార్కులుంటాయి. ఓవరాల్ మార్కులు మారవు. సైన్స్ మాత్రం రెండు పేపర్లుగా ఇస్తారు. అదే సమయంలో కాంపోజిట్ విధానం రద్దు చేశారు. ఇక నుంచి ఫస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది. తెలుగు విషయానికొస్తే విధానం కూడా మారింది. పద్యం ఇచ్చి ప్రతి పదార్ధం, భావం రాసే ప్రశ్న ఇకపై ఉండదు. దీని స్థానంలో పద్యం అలానే ఉంటుంది. దానిపై 4 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 8 మార్కులుంటాయి. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రంలో చేసిన మార్పుల్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ వివరించారు.
మరోవైపు రేషనైలేజేషన్ ఆధారంగా అవసరమైన చోటికి ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయనున్నారు. మున్సిపల్ స్కూళ్లలో టీచర్లకు సర్వీసు నిబంధనలు లేకపోవడంతో పెండింగులో ఉన్న మెడికల్ బిల్లుల గడువు పొడిగిస్తామని మంత్రి చెప్పారు. పదోన్నతులు , బదిలీల కారణంగా రెండు నెలల్నించి ఉపాధ్యాయులకు అందని జీతాల్ని వారం రోజుల్లో విడుదల చేస్తామన్నారు.
Also read: Ap Government: ఆర్ 5 జోన్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైన ప్రభుత్వం, సుప్రీంలో పిటీషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook