Ap Heavy Rains: బంగాళాఖాతంలో ఉత్తరాంధ్రర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ్టికి వాయుగుండంగా మారనుంది. ఫలితంగా రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనుండగా ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుండటంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దీనికితోడు కోస్తాంధ్ర, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు బలంగా కదులుతున్నాయి. ఫలితంగా రానున్న మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు. ఇక నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడనున్నాయి.
అనకాపల్లిలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్లు, విశాఖ రూరల్‌లో 7.7 సెంటీమీటర్ల వర్షపాతంం నమోదైంది.ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కుండపోతగా వర్షాలు కురిశాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook