Margadarsi Assets: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ చిట్‌ఫండ్ కంపెనీగా ఉన్న రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ చరాస్థుల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. డిపాజిట్ దారులు, చందాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం కీలకమైన అడుగేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చాలాకాలంంగా ఆర్ధిక అక్రమాలకు పాల్పడినట్టు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీల్లో వెల్లడైంది. ఖాతాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా తన అనుబంధ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి మళ్లించినట్టు కీలక ఆధారాలు సేకరించింది. ఆ తరువాత ఏ1 గా చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజ, బ్రాంచ్ మేనేజర్లపై ఏపీసీఐజీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని అనుసరిస్తున్నట్టుగా ఆధారాలు చూపితేనే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సూచించగా మార్గదర్శి నిరాకరించింది. ఫలితంగా గత ఏడాది డిసెంబర్ నుంచి మార్గదర్శి కొత్త చిట్టీలు ఆగిపోయాయి. ఆరు నెలల్లో ఏకంగా 400 కోట్ల టర్నోవర్ నిలిచిపోయింది. మరోవైపు చందాదారులకు సకాలంలో నగదు చెల్లించకపోవడంతో చిట్స్ రిజిస్ట్రార్, సీఐడీకు ఫిర్యాదులు అందుతున్నాయి.
అంటే చిట్టీలు వేసిన చందాదారుల సొమ్మును తిరిగి చెల్లించే స్థితిలో మార్గదర్శి ప్రస్తుతం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ చట్టం 1999 ప్రకారం మార్గదర్శి చరాస్థుల జప్తుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 793.50 కోట్లక విలువైన చరాస్థుల్ని స్వాధీనపర్చేందుకు ఏపీసీఐడీకు ప్రభుత్వం అనుమతిచ్చింది. న్యాయస్థానం అనుమతితో ఏపీసీఐడీ చరాస్థుల జప్తు చేయనుంది. ఇదే విషయాన్ని 50 బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు ప్రభుత్వం సమాచారమిచ్చింది.
Also read: YSRCP vs Janasena: వైసీపీ vs జనసేన ఫ్లెక్సీల వార్.. పవన్ కళ్యాణ్‌ని అవమానించేందుకేనా అంటున్న జనసేన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook