APPSC Controversy: గ్రూప్ 1 మెయిన్స్‌లో ఎల్లో జర్నలిజం-పోరాటంపై ప్రశ్న చుట్టూ వివాదం

APPSC Controversy: ఏపీ అధికార పార్టీ నేతల నోటి నుంచి తరచూ విన్పించే ఎల్లో జర్నలిజం మాట ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమౌతోంది. ప్రతిపక్షాల అభ్యంతరాలతో వివాదం రేగుతోంది. కారణం ఎల్లో జర్నలిజం ఆఖరికి గ్రూప 1 పరీక్షల్ని కూడా వదలకపోవడమే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 6, 2023, 09:38 AM IST
APPSC Controversy:  గ్రూప్ 1 మెయిన్స్‌లో ఎల్లో జర్నలిజం-పోరాటంపై ప్రశ్న చుట్టూ వివాదం

APPSC Controversy: చాలాకాలంగా మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీల వారీగా విడిపోవడమే కాకుండా ఓ వర్గం మీడియాకు ఎల్లో మీడియాగా ప్రచారం లభిస్తోంది. ఎల్లో మీడియా, ఎల్లో జర్నలిజం పదాలు ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సిన గ్రూప్ 1 పరీక్షల్లో కూడా ఎల్లో జర్నలిజం ప్రస్తావనకు రావడం వివాదానికి దారితీస్తోంది.

ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 పరీక్షలు ఇటీవలే జరిగాయి. ఈ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు చర్చనీయాంశమౌతున్నాయి. ఎల్లో జర్నలిజం-పోరాటం గ్రూప్ 1 పరీక్షలో ప్రశ్న రావడంతో ఏం సమాధానం రాయాలి, ఎలా రాయాలో అర్ధం కాక అభ్యర్ధులు ఇబ్బందులు పడినట్టు తెలుస్తోంది. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని తరచూ విమర్శించే మీడియాను ఎల్లో మీడియాగా, వాస్తవాల్ని వక్రీకరించి చూపించడాన్ని ఎల్లో జర్నలిజంగా  విమర్శిస్తుంటారు. ఏపీలో అయితే టీడీపీ అనుకూల మీడియాపై ఎల్లో మీడియా, ఎల్లో జర్నలిజం ముద్రపడింది. ఈ క్రమంలో గ్రూప్ 1 పరీక్షల్లో ఈ ప్రశ్న రావడం వివాదాస్పదమౌతోంది. ఎల్లో జర్నలిజంపై ప్రశ్న రావడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. 

ఐదు ప్రశ్నలిచ్చి ఒకదానికి సమాధానం రాయాలన్న ఆప్షన్ ఉంది. 20 మార్కుల ప్రశ్న ఇది. గత వారం జరిగిన తెలుగు పరీక్షలో,  తాజాగా జరిగిన ఇంగ్లీషు పరీక్షలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే ప్రశ్నవచ్చింది. అదే విధంగా నాడు నేడు కింద చేపట్టిన నిర్మాణాల గురించి మరో ప్రశ్న వచ్చింది. తాజాగా ఎల్లో జర్నలిజంపై పోరాటం ప్రశ్న రావడంతో అభ్యర్ధులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అందుకే ఇప్పుడు విపక్షాలు ఈ విషయంపై రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

Also read: Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెగ్యూలరైజ్‌కు గ్రీన్ సిగ్నల్

ఏపీపీఎస్‌సి..వివిధ సమకాలీన అంశాలపై అవగాహన కోసం ఇలాంటి ప్రశ్నలు వేసిందో లేదా ప్రభుత్వ పెద్దల్ని మెప్పించేందుకు చేసిందో తెలియదు కానీ చర్చమాత్రం రేగుతోంది. ఎవరి ఉద్దేశ్యాలు ఎలా ఉన్నా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, రాజకీయ వ్యవహారాలు, పాలక, విపక్ష ప్రభుత్వాల శైలి, మీడియా ఎలా ఉందనే విషయాలనైతే అభ్యర్ధులు తెలుసుకోవడం మంచిదే. ఈ క్రమంలో వేసిన ప్రశ్న ఎల్లో మీడియాపై పోరాటం అని ఉంటే విమర్శించవచ్చు గానీ, ఎల్లో జర్నలిజంపై పోరాటం అన్నప్పుడు వివాదం ఎందుకనే ప్రశ్నలు కూడా విన్పిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవాన్ని వక్రీకరించి రాసేది ఏదైనా ఎల్లో జర్నలిజం కిందకే వస్తుంది మరి. 

Also read: Viveka Letter Judgement: వివేకా లేఖకు నిన్‌హైడ్రిన్ పరీక్ష ఉంటుందా లేదా, ఎల్లుండే కోర్టు తీర్పు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News