Arasavally Surya Narayana Temple:సూర్యభగవానుడి దర్శనం కోసం రాత్రి నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అరసవల్లిలో సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సూర్య నారాయణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం దాదాపు 5 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో వేచివున్నారు.
అనంతరం స్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.సుమారు 1.20 లక్షల మంది భక్తులు రథసప్తమి ఉత్సవాలకు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 2,300 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఘనంగా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కొనసాగు తుండడంతో వీఐపీ, వీవీఐపీ, వీవీపీల దర్శనాలను రద్దు చేశారు. ఉచిత క్యూలైన్లలో వచ్చే సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా, నిరంతర దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.