ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌తో సత్సంబంధాలతో జగన్ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల పంపకం, నీటి ప్రాజెక్టులు ఇలా ఇతర అంశాలపై ఇరువురు సఖ్యతతో వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారోభోత్సవానికి సీఎం జగన్ హాజరుకావడం ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుడుతున్నాయి. ఈ ప్రాజెక్టు విషయంలో గతంలో అభ్యంతరాలను వ్యక్తం చేసిన జగన్ ఇప్పుడు వెనకేసుకేసు రావడం ఏంటని ప్రశ్నింస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై ఏపీ బీజేపీ చీప్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. కేసీఆర్ దోస్తీ.. కాళేశ్వరం అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జగన్ గారూ స్నేహం చేసుకోండి కానీ ..రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే ఊరుకోమంటూ కన్నా ఘాటుగా స్పందించారు.
గత ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ చేయాలి - కన్నా
ఈ సందర్భంగా కన్నా లక్ష్బీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతిపై వైసీపీ సర్కార్ శ్వేతపత్రాలను విడుదల చేసి ఊరుకోవడం సరికాదు. అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఇకపై పార్టీని నడిపే సామర్థ్యం లేదని ఆ పార్టీ నేతలు గుర్తించారని కన్నా విమర్శించారు.
ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం - కన్నా
ఏపిలో బీజేపీ క్రమ క్రమంగా బలపడుతుందని కన్నా పేర్కొన్నారు. వివిధ పార్టీల నుండి అనేక మంది నేతలు బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మళ్లీ జతకట్టే ఆలోచన బీజేపీకి లేదని ..ఇదే విషయాన్ని తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసినట్లు కన్నా తెలిపారు.