తాడిపత్రి: మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డిపై ( JC Diwakar Reddy ) మరో కేసు నమోదైంది. శుక్రవారం తాడిపత్రిని గనుల శాఖ కార్యాలయం వద్ద జేసీ దివాకర్ రెడ్డి నిరసనకు దిగారు. అధికారులు ప్రభుత్వానికి, అధికార పార్టీ నేతలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారంటూ జేసి ఆందోళన చేపట్టారు. టీడీపీ ( TDP ) అధికారంలోకి వచ్చాకా అధికారుల పని చెబుతాం అంటూ అధికారులపై జేసి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో గనుల శాఖ అధికారులపై జేసి దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై 156(A), 506 సెక్షన్ల కింద తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. Also read : Ys jagan letter to CJI: ఆ లేఖలో ఏముందసలు? ఆ ఆరోపణలేంటి ?
Notices to JC Diwakar Reddy family members జేసి కుటుంబసభ్యులకు నోటీసులు:
అంతకంటే ముందుగా జేసి దివాకర్ రెడ్డి కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్ సంస్థల్లో మైనింగ్ ( Mining ) నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ మైనింగ్ అధికారులు జేసి కుటుంబసభ్యులకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. కార్మికుల భద్రత కోసం మైనింగ్ జరుగుతున్న చోట ఎటువంటి చర్యలు చేపట్టలేదని, నిబంధనల ప్రకారం మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ జరగడం లేదని అందుకే వారికి నోటీసులు జారీచేశామని మైనింగ్ విభాగంలోని డిప్యూటి డైరెక్టర్ రమణా రావు తెలిపారు. Also read : AP High court: ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు?