గల్లా ప్రసంగంపై చంద్రబాబు, లోకేష్ ప్రశంసలు

                            

Last Updated : Jul 20, 2018, 04:02 PM IST
గల్లా ప్రసంగంపై చంద్రబాబు, లోకేష్ ప్రశంసలు

అవిశ్వాసతీర్మానం చర్చలో అనర్గళంగా ప్రసంగించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ను చంద్రబాబు ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు.. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే..పార్లమెంట్ లో ఆంధ్రుల వాయిస్ ను ఎంపీ గల్లా జయదేవ్ చక్కగా వినిపించారని చంద్రబాబు అభినందించారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఆంధ్రుల వాయిస్ దేశ నలుమూలకు చేరిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భగా చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ ఎంపీ గల్లాను పొగుడ్తూ ట్వీట్ చేశారు. గల్లా ప్రసంగం అందరినీ ఆకట్టుకుందన్నారు. అర్థమయ్యే రీతిలో గల్లా స్పష్టంగా మాట్లాడారని కొనియాడారు. ఏపీకి న్యాయం చేస్తారని నమ్మి ఎన్డీయేలో చేరితే..నిలువునా ముంచేశారని.. అందుకే తెగదెంపులు చేసుకొని బయటికి వచ్చామన్నారు. బీజేపీ  తమకు అబద్ధపు హామీలు ఇస్తూ ఏపీ ప్రజలకు మోసం చేసిందని విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దొందు దొందే అని లోకేష్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపం కాంగ్రెస్ ది అయితే... విభజన హామీలను విస్మరించిన బీజేపీ ద్రోహిగా నిలిచిపోయిందన్నారు. విభజన హామీల అమలు కోసం సీఎం చంద్రబాబు ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు. చివరకు ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని లోకేష్ అన్నారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని లోకేష్ వ్యాఖ్యానించారు.

 

Trending News