Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే. జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి మొదలు అధికారంలోకి వచ్చేంత వరకూ పవన్ తీసుకున్న ప్రతి నిర్ణయం సెన్సేషనే.అలాంటి పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారంలోకి వచ్చాక తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఎలాగైతే ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించారో... అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరును కొనసాగిస్తున్నారు.రాష్ట్రలో అధికారంలో ఉన్నది తమ కూటమి ఐనా తప్పిదాలు చేస్తే మాత్రం ప్రశ్నించడం మానను అని సంకేతాలు పంపుతున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ వైఖరిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
తప్పు చేసే వాళ్లు తనవాళ్లైనా సరే తాట తీస్తామని పవన్ హెచ్చరించడాన్ని సామాన్య ప్రజల నుంచి మేధావులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక పలు సందర్భాల్లో జరిగిన తప్పిదాలను పవన్ బహిరంగంగానే తప్పుబట్టారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగమై ఉండి ఇలా ప్రశ్నించడం సబబు కాదని సొంత కూటమి నుంచి విమర్శలు వచ్చిన పవన్ మాత్ర వెనక్కి తగ్గడం లేదు. అన్యాయం జరిగితే ప్రశ్నించి తీరుతా, తప్పు జరిగితే తాటతీస్తా అనేది తన తీరు అని పవన్ కూడా స్పష్టం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం పిఠాపురంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రేప్ ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిభధ్రతల విషయంలో హోంశాఖ పూర్తిగా విఫలం అయ్యిందంటూ కామెంట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనికి హోంమంత్రి అనిత. అదే విధంగా డీజీపీ పోలీస్ శాఖ బాధ్యత తీసుకోవాలని అనడం అప్పట్లో ఏపీ పాలిటిక్స్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు తాను హోం మంత్రి అయి ఉంటే లెక్క మరోలా ఉండేది అని కూడా అన్నారు.ఇక ఇటీవల జరిగిన మరో ఘటన విషయంలో పవన్ స్పందించిన తీరు కూడా చాలా సంచలనంగా మారింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల తొక్కిసలాటపై కూడా పవన్ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. దీనికి అంతటికి కారణం పోలీస్ శాఖ,టీటీడీ వైఫల్యమే అంటూ ప్రజలకు ప్రభుత్వం తరుపును క్షమాపణలు చెప్పడంపై కూడా సెన్సేషన్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహించి బాధితులకు క్షమాపణ చెప్పడం ఏపీలో తీవ్ర హాట్ టాపిక్ గా మారింది.
దీంతో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇటీవల ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పోలీసులు చాలా ఉదాసీనంగా ఉంటున్నారని ప్రజల నుంచి తనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. అంతే కాదు నియోజకవర్గంలో గంజాయి వాడకం, ఈవ్ టీజింగ్, చిల్లర దొంగతనాలు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని సీరియస్ అయ్యారు. మీరు చేసే తప్పిదాలకు నేను బాధ్యత వహించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే వదలిపెట్టవద్దు అని పోలీసుకుల స్పష్టం చేశారు.
ఐతే పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఎలా ఉన్నాడో అధికారంలోకి వచ్చాక కూడా జనసేనాని అలానే ఉన్నారనే మాట ప్రజల నుంచి వినపడుతుంది.పవన్ కళ్యాణ్ తీరు నేటి రాజకీయ నాయకుల పూర్తిగా భిన్నంగా ఉందని తెగ చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించి అధికారంలోకి వచ్చాక సమర్థించుకున్న నేతలను ఎందరినో చూశాం కానీ పవన్ మాత్రం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని తెగ్ చెప్పుకుంటున్నారు. తప్పు జరిగితే నిలదీయడం దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి రాజకీయాల్లో తెగింపు అవసరమని ఏపీ ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడంపై కూడా ఇదే తరహా చర్చ జరుగుతుంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ తీరుపై కూటమిలోని టీడీపీ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పవన్ సొంత ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత వరకు సబబు అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షం నుంచి కూడా పవన్ కు కౌంటర్లు వస్తున్నాయి. ప్రభుత్వం తీరున ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబడుతున్నారంటే పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని వైసీపీ నుంచి వస్తున్న మాట. ఇదే సమయంలో మరి కొందరు మాత్రం పవన్ ఇక్కడే తన అసలైన రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ఇటు టీడీపీనీ, అటు వైసీపీనీ ఒకే సమయంలో ఇద్దరిని తెలివిగా రాజకీయంగా నిలువరిస్తున్నారనేది కొందరి మాట.తన తాజా రాజకీయ వ్యూహంతో ఇటు టీడీపీనీ కంట్రోల్ పెట్టుకోవడంతో పాటు అటు వైసీపీనీ ప్రశ్నించకుండా అడ్డుకట్టవేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతుంది.
మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ తీరుతో ఇటు టీడీపీ, అటు వైసీపీ కూడా తెగ టెన్షన్ పడుతుందట. రాజకీయంగా పవన్ చాలా రాటుదేరాని, తమ నాయకుడు ఇలా సందర్భానుచితంగా వ్యవహరించడంపై జనసైనికులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడే ఇలా పవన్ తీరు ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని తెగ చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.