Pawan kalyan: పవన్ కళ్యాణ్‌ హత్యకు కుట్ర..?.. డిప్యూటీ సీఎం ఆఫీస్ పై డ్రోన్ కలకలం.. అసలేం జరిగిందంటే..?

Drone flew in mangalagiri: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ పై డ్రొన్ చాలా సేపు ఎగరడం తీవ్ర దుమారంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం దాదాపు.. 20 నిముషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 18, 2025, 09:41 PM IST
  • పవన్ ఆఫీస్ పై డోన్ కలకలం..
  • పోలీసులకు ఫిర్యాదుచేసిన జననేతలు..
Pawan kalyan: పవన్ కళ్యాణ్‌ హత్యకు కుట్ర..?.. డిప్యూటీ సీఎం ఆఫీస్ పై  డ్రోన్ కలకలం.. అసలేం జరిగిందంటే..?

Drone flew over deputy cm  pawan kalyan camp office: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ మంగళగిరిలోని క్యాంప్ ఆఫీసు మీద గుర్తు తెలియనీ డ్రోన్ తిరగడం అందర్ని టెన్షన్ కు గురిచేసింది. దీంతో జనసేన నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా.. దీని వెనుకాల ఏదో కుట్ర కోణం ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇవాళ (శనివారం) మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల వరకూ దాదాపు 20 నిమిషాలపాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సైతం విషయాన్ని తెలియజేశారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవల విజయవాడ బుక్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు..విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అంతేకాకుండా.. గతంలో... విజయనగరం, మన్యం జిల్లాల పర్యటనకు పవన్ కళ్యాణ్ పర్యటించారు. అప్పుడు  ఒక ఫెక్ ఐపీఎస్ అంటూపవన్ చుట్టు తిరిగారు.

దీంతో డిప్యూటీ సీఎం భద్రతపై.. ఇంత నెగ్లీజెన్సీగా ఉంటారా.. అంటూ జనసేన నేతలు పోలీసులపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఘటన మాత్రం ఆందోలన కల్గించే అంశంగా మారిందని చెప్పుకొవచ్చు.

Read more: Tirumala: తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ జంట.. మరోసారి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన దివ్వెల మాధురీ.. ఏంచేసిందంటే..?

మరోవైపు.. సాక్షాత్తూ డిప్యూటీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా జనసైనికులు మండిపడుతున్నారంట. మరొవైపు పవన్ కళ్యాణ్ సనానత ధర్మంకోసం పోరాటం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంత మందిఆయనపై ప్రత్యేకంగా నిఘాపెట్టారనికూడా గతంలో వార్తలు వచ్చాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News