Youth Stunts Munneru River: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సానికి కారణమైన మున్నేరులో యువకులు అత్యుత్సాహానికి పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. తాగిన మైకంలో ఈత కొట్టుకుంటూ ఎవరూ త్వరగా ఒడ్డున చేరుతారోనని బెట్టింగ్ పెట్టుకున్నారు. వరద ఉధృతి తీవ్రంగా ఉన్న మున్నేరు వాగులో దూకారు. భారీ వరద ఉన్న మున్నేరు వాిద్దరూ గల్లంతయ్యారు. మద్యం మత్తులో చేసిన నిర్వాకంతో వారి కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో చోటుచేసుకుంది.
Also Read: AP Floods: ఆంధ్రప్రదేశ్‌కు అండగా 'డబ్బులు ఊరికే రావు' గుండు అంకుల్.. భారీ విరాళం
నందిగామ పెద్ద బ్రిడ్జి వద్ద మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడకు మద్యం సేవించి చేరుకున్న యువకులు మాడుగుల గోపిచంద్ అలియాస్ చంటి, రోశయ్య నీటిని చూసి సరదాగా ఈత పోటీ పెట్టుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు నదిలో దూకి ఎవరూ త్వరగా ఒడ్డుకు చేరుకుంటే వారికి రూ.2 వేలు అని బెట్టింగ్ వేసుకున్నారు. అయితే వరద తీవ్రస్థాయిలో ఉండడంతో వాగులోకి దూకిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం
వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ అతి కష్టంగా రోశయ్య అనే యువకుడు ఒడ్డుకు చేరుకున్నాడు. కానీ గోపీచంద్ మాత్రం పైకి రాలేదు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తోటి మిత్రుడు రోశయ్య భయాందోళన చెంది స్థానికులకు విషయం చెప్పారు. మద్యం మత్తులో ఈత బెట్టింగ్ వేసుకున్నామని చెప్పడంతో స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని గోపీచంద్ కోసం గాలిపు చర్యలు మొదలుపెట్టారు. అయితే రెండు గంటలుగా గాలిస్తున్నా చంటి ఆచూకీ లభించకపోవడంతో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అతడి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటనతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి ఉధృతి అధికంగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. భారీ వరదలు వస్తున్న సమయంలో జలాశయాల వద్దకు చేరుకోవద్దని చెప్పారు. సెల్ఫీలు, ఫొటోలు, పోటీల వంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా వాగు ఉధృతి చూస్తుంటే గోపీచంద్ కొట్టుకుపోయి ఎక్కడో అక్కడ జలసమాధి అయ్యి ఉంటాడని అధికార యంత్రాంగం భావిస్తోంది. అతడిని ప్రాణాలతో బయటకు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలకు వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో సహాయ చర్యలకు కష్టంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి