Balineni Srinivas reddy comments on ysr family property issue: ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కుటుంబం ఆస్తుల గొడవలు రాజకీయంగా రచ్చగా మారాయి. తన తండ్రి నుంచి తనకు రావాల్సిన ఆస్తులు రాకుండా జగన్ అడ్డుపడుతున్నాడని షర్మిల రచ్చ కేక్కారు. అంతేకాకుండా.. గతంలో తన అన్నకు, తనకు జరిగిన.. ఒప్పందం తన తల్లి విజయమ్మ ముందు జరిగిందని కూడా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అంటున్నారు.
ఇప్పటికే పలు బహిరంగ లేఖల్ని సైతం షర్మిల సంధించారు. ఇదిలా ఉండగా.. వీరి వివాదం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకొవచ్చు. వైఎస్సార్సీపీ నేతలు.. షర్మిల.. సీఎం చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తన అన్నను షర్మిల అపోసిషన్ పార్టీలతో కుమ్మక్కై జైలుకు వెళ్లేలా కుట్రలు చేస్తున్నారని ఏకీ పారుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాజీ మంత్రి బాలినేని ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన జగన్, షర్మిల ఆస్తుల వివాదంపై మాట్లాడారు. తాను ప్రస్తుతంజనసేన పార్టీలో ఉన్పప్పటికి తనకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా.. 40 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి హుందాగా రాజకీయాలు చేశారన్నారు. తాము.. ఆర్థికంగా బలపడ్డాము అంటే కారణం విజయమ్మ తోడ్పాటు అందించారని అన్నారు.
అయితే.. షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారనడాన్ని మాత్రం బాలినేని ఖండించినట్లు తెలుస్తొంది. కుటుంబంలో నెలకొన్న ఆస్తుల తగాదాను.. కూటమి కి అంటగట్టడం సబబు కాదన్నారు. వెంటనే విజయమ్మ కల్గజేసుకుని ఈ గొడవలకి పుల్ స్టాప్ పెట్టాలన్నారు. వీరి ఆస్తులు వివాదంలో.. విజయమ్మ నే జడ్జిమెంట్ ఇవ్వాలన్నారు. మహానేత.. రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఆస్తుల కోసం రోడ్ ఎక్కడం బాధగా ఉందన్నారు. అదే విధంగా.. ఆడబిడ్డ కంట తడి పెట్టడం మంచిది కాదని వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి పెద్ద మనషులుగా సర్దుబాటు చేయాలని కోరారు. కొంత మంది సమస్యను జటిలం చేసి వైఎస్ కుటుంబం పరువును బజారుకీడుస్తున్నారు.
మహానేత సంతానమైన షర్మిల, జగన్ ప్రజలకు ఆదర్శంగా ఉండాలే తప్ప.. ఇలా చేయకూడదని అన్నారు. అదే విధంగా కొంత మంది తనపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీలో ఆస్తులు సంపాదించి, జనసేనలోకి వెళ్లారంటున్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో ఉండగా.. ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప సంపాదించుకోలేదన్నారు.
ఈ విషయం జగన్ కి కూడా తెలుసన్నారు. పార్టీ కోసం అనేక సందర్భాలలో ఆస్తులు అమ్ముకున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందే.. పవన్ కళ్యాన్ జనసేనలోకి చేర్చుకునేందుకు పాజిటివ్ సంకేతాలు ఇచ్చారన్నారు. అంతే కాకుండా.. గతంతో జగన్ కోసం మంత్రి పదవి సైతం వదుకున్న విషయం సైతం గుర్తు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.