Batchula arjunudu: టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు.. పరిస్థితి విషమం..

Batchula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 10:55 AM IST
  • టీడీపీలో మరో నేతకు గుండెపోటు
  • క్రీటికల్ గా కండిషన్
  • ఆస్పత్రికి టీడీపీ నేతలు
Batchula arjunudu: టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు.. పరిస్థితి విషమం..

Batchula arjunudu Heath Updates: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (Batchula arjunudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హూటాహుటిన విజయవాడ రమేశ్ ఆస్పత్రికి తరలించారు. బచ్చులకు స్టంట్ వేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బీపీ ఎక్కువగా ఉండటం వల్లే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు అంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ చీప్ చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వైద్యులతో ఫోన్ లో మాట్లాడి విషయాలు తెలుసుకుంటున్నారు. 

గతంలో కూడా బచ్చులకు గుండెపోటు వచ్చింది. అప్పుడు రమేశ్ ఆస్పత్రిలోనే సర్జరీ చేశారు. ఇప్పుడు మరోసారి హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన రెండుసార్లు కొవిడ్ బారిన కూడా పడ్డారు. కరోనా తర్వాత ఊపిరితిత్తుల సమస్య ఆయనను వెంటాడినట్లు బచ్చుల అనుచరులు తెలిపారు. 

ప్రస్తుతం బచ్చుల అర్జునుడు గన్నవరం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరమవ్వడంతో ఆయన స్థానంలో గన్నవరం నియోజకవర్గం బాధ్యతలను బచ్చులకు అప్పజెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసేందుకు ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు రమేశ్ ఆస్పత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Vatti Vasanth Kumar: విషాదం.. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ కన్నుమూత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News