AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో అలర్ట్

Heavy Rains in AP | రానున్న నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Last Updated : Nov 12, 2020, 12:06 PM IST
AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు (Heavy Rains in Andhra Pradesh) కురవనున్నాయి. రానున్న నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ (Andhra Pradesh) విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండీ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు.

ఆ ఐదు జిల్లాలలతో పాటు ఏపీలో మరికొన్ని కొన్ని జిల్లాల్లోనూ తేలిక పాటి వర్షాలు కురవనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. శ్రీలంక తీరానికి దగ్గరలోని నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర ఆంధ్రా తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోన్న అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News