మొదటి నుంచి జేసీ సోదరులది విలక్షమైన వ్యక్తిత్వం. అన్న జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ, తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే. అన్న అనంతపురం చూసుకుంటే తమ్ముడు తాడిపత్రి చూసుకుంటారన్న మాట. వీరు ఏ పార్టీలో ఉన్నారన్నది ముఖ్యం కాదు.. వాళ్ల పనులు జరుగుతున్నాయా? లేదా అన్నదే వారికి ముఖ్యం. లక్ష్యాన్ని చేరుకొనేందుకు వీరు ఎంతకైనా తెగిస్తారు. కాంగ్రెస్ లో ఉన్నా వారు అదే చేశారు.. ఇప్పుడు టీడీపీలో ఉన్నా అదే తంతు.
ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే .. మొన్న వాళ్ల అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేసినందుకు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి స్టేషన్ కు వెళ్లి చేసిన రభస అంతా ఇంతా కాదు. బెయిల్ కూర్చున్న చోటే తెప్పించి.. పోలీసు స్టేషన్ నుంచి విడిపించుకొని పోయాడు ప్రభాకర్. అర్ధమయ్యిందా వీళ్ల రేంజ్ ఏంటో..!
ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారయ్యిందటే.. ఇక్కడ పనిచేయడానికి అధికారులు భయపడుతున్నారు. అక్కడ ఉన్న అధికారులు కూడా బదిలీ చేయించుకొని పోవడానికి సిద్ధమవుతున్నారు. వీళ్లు ఎప్పుడొచ్చి తమ మీద పడతారో అని రెవిన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ ఇలా అన్నీ శాఖల అధికారులు హడలిపోతున్నారు. వాళ్ల వారికి వీళ్లు చేసేది హీరోయిజంలా కనిపిస్తున్నా.. బయటోళ్లకి మాత్రం రౌడీయిజంలా కనిపిస్తోంది.