Adityanath Das: ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు

AP New CS Adityanath Das: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాస్ట్ర ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు దాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Last Updated : Dec 31, 2020, 09:44 PM IST
Adityanath Das: ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు

AP New CS Adityanath Das: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాస్ట్ర ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు దాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు నీలం సాహ్ని పదవీకాలం నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. దీంతో ఆమెను ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 

జనవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆదిత్యనాథ్ దాస్‌కు ఏపీ సీఎస్‌గా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) బాధ్యతలు అప్పగించారు. నేడు ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్ దాస్ ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read : EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి

 

తనకు సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ(Andhra Pradesh) సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు వెళ్తానన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా ముందుకు సాగుతానని నూతన సీఎస్ దాస్ స్పష్టం చేశారు.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

 

కాగా, ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టడంతో జనవనరులశాఖ ప్రధాన కార్యదర్శిగా జే శ్యామలరావును ఏపీ సర్కార్ నియమించింది. తెలంగాణ కేడర్ నుంచి వచ్చిన ఐఏఎస్ శ్రీలక్ష్మికి పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ కార్యదర్శిని జలవనరుల శాఖకు బదిలీ చేశారు. సాంఘీక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమించారు.

Also Read : PF Balance Missed Call Number: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.. ఒక్క మిస్డ్ కాల్ చాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News