/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

Jagan Anna Thodu Scheme: ఏపీలో చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ వృత్తుల వారికి వైఎస్ జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న తోడు పథకం ద్వారా వారికి రూ. 10 వేలు వడ్డీ లేని రుణం అందిస్తున్న ఏపీ సర్కారు తాజాగా ఇవాళ ఐదో విడత రుణాలు విడుదల చేసింది. కొత్తగా సుమారు 3.95 లక్షల మంది లబ్ధిదారులకు జగనన్న తోడు పథకం కింద నేడు రూ. 395 కోట్ల రుణం అందించారు. గత 6 నెలల కాలంలో సకాలంలో రుణాలు చెల్లించిన వారిని అందరిదీ ఓ జాబితా రూపొందించి వారికి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదలచేశారు.

జగనన్న పథకం 5వ విడత రుణాలు విడుదల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో దాదాపు 15,03,558 మంది కుటుంబాలకు జగనన్న తోడు పథకం ద్వారా  రూ.2011 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించి వారికి మేలు చేశాం అని అన్నారు. సుమారు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.395 కోట్ల రుణాలు అందించి వారి వ్యాపారాభివృద్ధికి సహాయపడుతున్నాం.   

చిరు వ్యాపారులను ఆకాశానికెత్తిన వైఎస్ జగన్...
చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా.. ఇంకొంతమందికి కూడా ఏదో రూపంలో ఉపాధిని కల్పిస్తున్నారు. అంతేకాకుండా భారీ లాభాలకు ఆశపడకుండా నామమాత్రపు లాభాలనే సంతోషంగా స్వీకరిస్తూ బతుకుదెరువు కొనసాగిస్తున్నారు. అందుకే ఈ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు వ్యాపారం చేస్తున్నారు అని అనడం కంటే గొప్ప సేవ చేస్తున్నారు అని అనడానికి వెనుకాడాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ చిరు వ్యాపారులకు కితాబిచ్చారు. 

చిరు వ్యాపారుల బాధలు నా కళ్లారా చూశాను...
చిరువ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో మరో ప్రత్యామ్నాయం లేక వారంతా వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి అధిక వడ్డీలు, చక్రవడ్డీలకు రుణాలు తీసుకుని.. అవి తిరిగి చెల్లించలేక ఎన్ని బాధలు పడుతున్నారో నా పాదయాత్రలో స్వయంగా నా కళ్లారా చూశాను. అప్పుడే వారికి హామీ ఇచ్చాను.. ఈ అధిక వడ్డీల బారి నుంచి మిమ్ముల్ని విముక్తి చేస్తాను అని. అప్పుడు ఇచ్చిన మాట ఇంకా తనకు బాగా గుర్తుందని జగన్ అన్నారు. 

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ తరహా పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య మొత్తం 34 లక్షల మంది కాగా.. కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే అందులో సగభాగం.. అంటే 15.03 లక్షల మందికి లబ్ధీ చేకూరుతోంది. జగనన్న తోడు పథకం అమలుకు సహకరించిన ప్రతి బ్యాంకుకు, తోడ్పాటు అందించిన ప్రతి అధికారికీ కృతజ్ఞతలు చెబుతున్నాను అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Also Read : AP 10th Supplementary Results: పది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..!

Also Read : Achyuthapuram SEZ: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకేజ్.. 100 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
jagan anna thodu scheme 5th installment released by ap cm ys jaganmohan reddy
News Source: 
Home Title: 

Jagan Anna Thodu Scheme: జగనన్న తోడు పథకం.. ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్

Jagan Anna Thodu Scheme: జగనన్న తోడు పథకం.. ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

చిరువ్యాపారులను ఆకాశానికెత్తిన వైఎస్ జగన్

చిరు వ్యాపారుల బాధలు నా కళ్లారా చూశానన్న వైఎస్ జగన్

వాళ్లది వ్యాపారం కాదు.. గొప్ప సేవ అని కితాబు

Mobile Title: 
Jagan Anna Thodu Scheme: జగనన్న తోడు పథకం.. ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, August 3, 2022 - 17:13
Request Count: 
76
Is Breaking News: 
No