Pawan Kalyan Deeksha: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటి సారి తిరుమలకు వచ్చారు. దీంతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు ఆయనకు మద్దతుగా భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అంతేకాదు అలిపిరి కాలిమెట్ల దారి నుంచి నడుచుకుంటూ తిరుమల వెళ్లారు. అంతేకాదు దారి మధ్యలో కొంత మంది భక్తులు డిప్యూటీ సీఎంను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. మరికొంత మంది ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. మరోవైపు దారి మధ్యలో తిరుమల భక్తులు తీసుకునే జలప్రసాదాన్నే స్వీకరించి కాలి నడకన తిరుమల చేరుకున్నారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవన్ కల్యాణ్ గత 11 రోజులుగా చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. అయితే ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆయన తిరుమల తిరుపతి లోనే పర్యటించనున్నట్లు తెలుస్తుంది.
నిన్న రాత్రి పాటు ఈ రోజు కూడా తిరుమలలోనే పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకొని దీక్షను విరమించనున్నారు. దర్శనాంతరం లడ్డూ కౌంటర్, వెంగమాంబ కాంప్లెక్స్‌ను పరిశీలించనున్నట్టు సమాచారం. రేపు సాయంత్రం దీక్ష విరమిస్తారు. ఆ తర్వాత తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.
తిరుమల లడ్డూ కల్తీపై డిప్యూటీ సీఎం అప్పటి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రీసెంట్ గా సనాతన ధర్మ పరిరక్షణ కోసం సాధు సంతులు, పండితులు,హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారితో ఓ సనాతన ధర్మ బోర్డ్ ఏర్పాటు పై పిలుపునిచ్చారు. మరోవైపు పవన్ ఇచ్చిన ఈ పిలుపుకు హిందూ సంఘాలు పవర్ స్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే మూవీలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ చేస్తున్నారు. ఓ వారం పది రోజుల్లో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఓ వారం రోజులు పాటు చేస్తే ఈ సినిమా మొదటి పార్ట్ కంప్లీట్ అవుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి28న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరోవైపు పవన్ సుజిత్ దర్శకతవ్ంలో ‘ఓజీ’ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.