Tirupati Bypoll 2021: తిరుపతి ఉప ఎన్నిక నేపధ్యంలో బీజేపీ-జనసేన పొత్తుపై అనుమానాలు తలెత్తాయి. రెండింటి మధ్య సయోధ్య కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నలు విన్పించాయి. ఈ నేపధ్యంలో జనసేనాని ఆ సందేహాలకు సమాధానమిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లోక్‌సభ (Tirupati loksabha) స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికపైనే అందరి దృష్టీ నెలకొంది. విజయం కోసం రప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party) నుంచి డాక్టర్ గురుమూర్తి రంగంలో దిగారు. ఇక జనసేన-బీజేపీ పొత్తుతో ( Bjp-Janasena alliance) బీజేపీ అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ రంగంలో దిగారు. అయితే రత్నప్రభ నామినేషన్ సమయంలో జనసేన నుంచి ఎవ్వరూ హాజరుకాకపోవడంతో రెండు పార్టీల పొత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. సయోధ్య ఎంతవరకు కొనసాగుతుందనే ప్రశ్న తలెత్తింది. ఈ నేపధ్యంలో అన్ని అనుమానాలకు చెక్ పెడుతూ జనసేనాని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో దిగేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
ఏప్రిల్ 3న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తిరుపతిలో ఎన్నికల ప్రచారం ( Tirupati Bypoll) నిర్వహిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభకి మద్దతుగా తిరుపతి నగరంలోని ఎమ్ఆర్ పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. పవన్ రాకతో తిరుపతి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. పవన్ పర్యటన అటు జనసైనికుల్లో కూడా ఉత్సాహం నింపనుంది. జనసేనాని టూర్ తమకు కలిసొస్తుందని బీజేపీ కూడా భావిస్తోంది.
ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా పవన్ కల్యాణ్ ( Pawan kalyan) పాదయాత్ర ఉంటుందని జనసేన నేతలు చెప్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం మూడు గంటలకు పవన్ ప్రచారం ప్రారంభం కానుంది. పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ వద్ద భారీ బహిరంగసభ (Pawan kalyan public meeting) నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున తరలిరానున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Also read: Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నికలో జనసేన-బీజేపీ పొత్తుపై అనుమానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook