Janasena Varahi Yatra Schedule: వారాహి విజయ యాత్రకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శనం చేసుకొని ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. వారాహి నుంచి తొలి బహిరంగ సభను ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో నిర్వహిస్తారు. ఇక్కడి నుంచే జనసేనాని తన ప్రసంగం ఇవ్వనున్నారు. ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
కత్తిపూడి నుంచి వారాహి విజయ యాత్ర ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుతుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
అదేవిధంగా వివిధ సమస్యలతో సతమతమవుతూ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో 'జనవాణి' కార్యక్రమం చేపడతారు. ప్రజలు ఇచ్చే విజ్ఞాపనలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి సంబంధిత శాఖలకు ప్రజల ఇబ్బందులు, సమస్యలు తెలియచేసి పరిష్కారం కోసం పార్టీ పక్షాన ముందుకు వెళ్లాలని ఇప్పటికే నాయకులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో వారాహి యాత్ర, అనంతరం సభ నిర్వహిస్తారు. వారహి యాత్రను విజయవంతం చేసేందుకు కమిటీలను నియమించారు.
జనసేన వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ఇలా..
==> 14 జూన్: వారాహి నుంచి ప్రత్తిపాడు నియోజకవార్గం కత్తిపూడిలో సభ
==> 16 జూన్: పిఠాపురంలో వారాహి యాత్ర, సభ
==> 18 జూన్: కాకినాడలో వారాహి యాత్ర, సభ
==> 20 జూన్: ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ
==> 21 జూన్: అమలాపురంలో వారాహి యాత్ర, సభ
==> 22 జూన్: పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర.. రాజోలు నియోజకవర్గం మలికిపురంలో సభ
==> 23 జూన్: నరసాపురంలో వారాహి యాత్ర, సభ
JanaSena Chief Shri @PawanKalyan Varahi Yatra public meetings details.
వారాహి యాత్ర శ్రీ @PawanKalyan గారి బహిరంగ సభల షెడ్యూల్.#Varahi#JanaSenaVarahi #VarahiYatra pic.twitter.com/hCwRIT4bIY
— JanaSena Party (@JanaSenaParty) June 11, 2023
Also Read: Revanth Reddy: లీగల్ నోటీసు వెనక్కి తీసుకోండి.. ఐఏఎస్ అధికారికి రేవంత్ రెడ్డి హెచ్చరిక
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook