Jc Prabhakar reddy hot comments on rk roja: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ తరచుగా ఏదో ఒక వివాదస్పద అంశాలతో వార్తలలో ఉంటారు. ఇటీవల న్యూ ఇయర్ వేడుకల నేపథ్యలో తాడిపత్రిలో మహిళలో కోసం ఏర్పాటు చేసిన మహిళలకు మాత్రమే సెలబ్రేషన్స్ వేడుకలు వివాదస్పదంగా మారాయి. దీనిపై నటి మాధవీలత ఫైర్ అయ్యారు.
మొదట జేసీ మాధవీలతపై వ్యభిచారిణి అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత ఏదో పెద్దవాడ్నినోరు జారానని.. సారీ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో మరల తిరుమలలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాటపై మాట్లాడారు. తిరుమలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో.. వైసీపీ మాజీ మంత్రి రోజా ఇటీవల సీఎం చంద్రబాబు, కూటమి సర్కారుపై అనేక విమర్శలు చేశారు.
ఈ క్రమంలో దీనిపై తాజాగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తిరుమలలో గతంలో టోకెన్లు విక్రయించిన బెంజీకారు కొన్న నువ్వు కూడా.. మాకు నీతులు చెప్తున్నావంటూ ఏకీపారేశారు. అడ్డగోలుగా మాట్లాడితే వదిలేది లేదన్నారు.
‘తైతక్కలాడుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు.. ప్రతిదానికి తగుదునమ్మ అంటూ మాట్లాడతున్నావన జేసీ రెచ్చిపోయారు. నీ యవ్వారాలు చాలా ఉన్నాయని.. చెక్ బౌన్సుల కేసులు అనంతపురం కోర్టులో ఉన్న విషయం మర్చిపొవద్దని చురకలు పెట్టారు. అసలు.. చంద్రబాబు.. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి తప్పు చేశారని.. ఈ రోజున ఆయనను విమర్శించే స్థాయికి చేరుకున్నావా.. అంటూ సెటైర్ లు వేశారు.. వైసీపీ హయాంలో అనేక కష్టాలు పడ్డామని, చంద్రబాబు వారిని గాలి కొదిలేశారన్నారు.
లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో.. ఇక్కడ కార్యకర్తలపై 800 వరకు కేసులు నమోదయ్యాయని అన్నారు. తిరుమల ఘటన బాధకరమని చెప్తునే.. జగన్ పాలనలో ఎన్ని ఘోరాలు జరిగాయో వాటి సంగతి ఏమంటారని కౌంటర్ వేశారు. జగనాసుర చరిత్ర అంటూ ఒక ఫ్లెక్సీ సైతం వేయించారు. ప్రస్తుతం జేడీ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter